News October 3, 2025
VKBజిల్లాలో వైన్ షాప్‌ల టెండర్లకు ఒకే దరఖాస్తు.!

VKB జిల్లాలో 59 వైన్ షాపుల టెండర్లకు ఇప్పటి వరకు ఒకే దరఖాస్తు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 59 వైన్ షాపులకుగాను గత నెల 26 నుంచి 18 వరకు టెండర్లలో పాల్గొనేందుకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. గత నెల 25న కేవలం ఒక దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. తాండూర్ 18, వికారాబాద్ 12, పరిగి 15, కొడంగల్ 8, మోమిన్‌పేటలో 6 షాప్‌లు ఉన్నాయన్నారు.
Similar News
News October 4, 2025
KNR: అందరి దృష్టి కోర్టు తీర్పు పైనే..!

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీచేసి ఈనెల 9న నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తుంది. ఐతే ఈనెల 8న బీసీ రిజర్వేషన్ల పై కోర్టులో విచారణ జరుగనుంది. ఏ తీర్పు వస్తుందోనని ప్రభుత్వానికి, ఆశావాహులకు దడ పెరుగుతుంది. దీంతో రిజర్వేషన్ల చుట్టూనే రాజకీయాలు తిరుగుతుండగా, ఆశావహులు నిరాశలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646ఎంపీటీసీ స్థానాలున్నాయి.
News October 4, 2025
KNR: ఆశావాహులకు భారంగా పండగలు

TG పల్లెల్లో ప్రస్తుతం రెండు రకాల పండుగలు సందడి చేస్తున్నాయి. వీటిలో బతుకమ్మ, దసర, దీపావళి పండుగలు కాగా, మరొకటి స్థానిక సంస్థల పండుగ. ఐతే ఎన్నికల్లో పోటీచేసే ఆశావాహులకు వరుసగా వచ్చిన పండగలు భారంగా మారాయి. బతుకమ్మకు మహిళలకు ఒకే రకమైన చీరెలు, సౌండ్ బాక్స్‌లు, పురుషులను ధావత్‌లతో ప్రసన్నం చేసుకునేందుకు తిప్పలు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.
News October 4, 2025
HYD: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ విద్యతో పాటు క్రీడలు, విలువల ఆధారిత బోధన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంచేలా విద్యావిధానం ఉంటుంది. మరిన్ని వివరాలకు 9059196161 ద్వారా లేదా yipschool.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల యాజమాన్యం తెలిపింది.