News October 3, 2025

జిల్లాలో 210 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది: కలెక్టర్

image

జిల్లాలో యూరియా కొరత లేదని, ఇంకా 210 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. యూరియా అవసరమైన రైతులు తీసుకువెళ్లవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఇప్పటి వరకు 342 మెట్రిక్ టన్నుల యూరియాను 3,753 మంది రైతులకు పంపిణీ చేసినట్లు వివరించారు.

Similar News

News October 4, 2025

AP, TG న్యూస్ రౌండప్

image

☛ రేపు HYDకు AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చ
☛ మంగళగిరి-కృష్ణా కాలువ స్టేషన్ల మధ్య రూ.112 కోట్లతో ROB నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్
☛ నవంబర్ 5 నుంచి 9 వరకు కడప దర్గా ఉరుసు మహోత్సవం
☛ TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపు పునః ప్రారంభం

News October 4, 2025

మావోయిస్టులుగా అడవిలో ఉండి ప్రయోజనం లేదు: ఏసీపీ కృష్ణ

image

మావోయిస్టులుగా అడవుల్లో ఉండి ప్రయోజనం లేదని, ప్రజల జీవన స్రవంతిలోకి రావాలని PDPL ACP గజ్జి కృష్ణ అన్నారు. శ్రీరాంపూర్(M) కిష్టంపేట(V)లో మావోయిస్టు నేత కంకణాల రాజిరెడ్డి తల్లి వీరమ్మను పరామర్శించారు. రాజిరెడ్డి లొంగి, వృద్ధ తల్లిని చూసుకోవాలని సూచించారు. లొంగితే రివార్డు, ఉపాధి కల్పన ఉంటుందని వెల్లడించారు. వీరమ్మకు దసరాకు బట్టలు, పండ్లు, బియ్యం అందజేశారు. వెంట CI సుబ్బారెడ్డి, SI వెంకటేష్ తెలిపారు.

News October 4, 2025

KNR: అందరి దృష్టి కోర్టు తీర్పు పైనే..!

image

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీచేసి ఈనెల 9న నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తుంది. ఐతే ఈనెల 8న బీసీ రిజర్వేషన్ల పై కోర్టులో విచారణ జరుగనుంది. ఏ తీర్పు వస్తుందోనని ప్రభుత్వానికి, ఆశావాహులకు దడ పెరుగుతుంది. దీంతో రిజర్వేషన్ల చుట్టూనే రాజకీయాలు తిరుగుతుండగా, ఆశావహులు నిరాశలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646ఎంపీటీసీ స్థానాలున్నాయి.