News October 3, 2025
రాజధానికి భూసేకరణ.. క్యాబినెట్ కీలక నిర్ణయం

AP: రాజధాని అమరావతికి భూ సేకరణ విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. అలాగే కేంద్రం అమలు చేస్తున్న పూర్వోదయ స్కీమ్ ద్వారా రాష్ట్రానికి రూ.65,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పశువుల హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News October 4, 2025
HEADLINES

* కడపలో 2028లోగా జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి: CM CBN
* కూటమిది దద్దమ్మ ప్రభుత్వం: YCP
* రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసం: KTR
* స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు TG ఎన్నికల సంఘం ప్రకటన
* ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
* పాక్‌ను ప్రపంచ పటం నుంచి లేపేస్తాం: ఆర్మీ చీఫ్
* WIతో టెస్ట్.. రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు
News October 4, 2025
హైవేలపై పొలిటికల్ రోడ్ షోలు, ర్యాలీపై మద్రాస్ HC నిషేధం

TNలోని కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని స్టేట్, నేషనల్ హైవేలపై పొలిటికల్ రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధించింది. స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOPs) నిబంధనలు రూపొందించే వరకు ఈ బ్యాన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కరూర్ లాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా స్పష్టమైన నిబంధనలు రూపొందించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో ఈ తీర్పిచ్చింది.
News October 4, 2025
AP, TG న్యూస్ రౌండప్

☛ రేపు HYDకు AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చ
☛ మంగళగిరి-కృష్ణా కాలువ స్టేషన్ల మధ్య రూ.112 కోట్లతో ROB నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్
☛ నవంబర్ 5 నుంచి 9 వరకు కడప దర్గా ఉరుసు మహోత్సవం
☛ TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపు పునః ప్రారంభం