News October 3, 2025

టికెట్ల విడుదల కాలాన్ని తగ్గించడంపై త్వరలో నిర్ణయం: సింఘాల్

image

AP: మూడు నెలల ముందే శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తుండటంపై భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని TTD ఈవో అనిల్ సింఘాల్ అన్నారు. రైల్వే బుకింగ్ విధానాల్లో మార్పుల వల్ల దర్శనాలకు ఇబ్బంది కలుగుతోందని చెబుతున్నట్లు తెలిపారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకొని, టికెట్ల విడుదల కాలాన్ని 15 రోజులు/నెల లేదా 45 రోజులు/2 నెలలకు కుదించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Similar News

News October 4, 2025

దేశం విడిచి వెళ్తే 2,500 డాలర్లు: ట్రంప్

image

వలసదారుల పిల్లలు(14 ఏళ్లు లేదా పైబడిన) US విడిచి వెళ్తే ఒకేసారి 2,500 డాలర్లు(దాదాపు రూ.2.5 లక్షలు) ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. స్వచ్ఛందంగా దేశాన్ని విడిచివెళ్లడాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఆ పిల్లలు సొంతం దేశం చేరినట్లుగా ఇమ్మిగ్రేషన్ జడ్జి ఆమోదిస్తేనే డబ్బులు చెల్లిస్తామన్నారు. కాగా ఇది క్రూరమైన నిర్ణయమని విమర్శలు వస్తున్నాయి.

News October 4, 2025

మీకు ఒక్కరే సంతానమా..

image

ఇంట్లో ఒక్క సంతానమే ఉంటే వారు గారాబంగా పెరుగుతారు. బొమ్మలు, వస్తువులను వేరెవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. అయితే ఇలాంటి ప్రవర్తన భవిష్యత్తులో చిన్నారికి ప్రతికూలంగా మారొచ్చు. దీనికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం తోటి పిల్లలతో స్నేహం చేయడం, కలిసి ఆడుకోవడం, బొమ్మలను, ఫుడ్‌ను పంచుకోవడం వంటివి అలవాటు చేయాలి. దీనివల్ల క్రమంగా చిన్నారుల్లో మార్పు వచ్చి అందరిలోనూ కలిసిపోతారు.
<<-se>>#ChlidCare<<>>

News October 4, 2025

విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు గూడెం, బండ్ల

image

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న MLAలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్పీకర్ ఛాంబర్‌లో విచారణకు హాజరయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలను పిటిషనర్ల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. వీరిద్దరు కాంగ్రెస్‌లో చేరారని, వీరిపై వేటు వేయాలంటూ మహిపాల్ రెడ్డిపై చింత ప్రభాకర్, బండ్లపై పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. SC ఆదేశాలతో సెప్టెంబర్ 29 నుంచి విచారణ ప్రారంభమైంది.