News October 3, 2025
నర్సంపేట ఘటనపై విచారణ కొనసాగుతోంది: సీపీ

నర్సంపేట పట్టణ కేంద్రంలో గాంధీ జయంతి వేళ సీఐ సమక్షంలో జంతు బలి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. గురువారం సాయంత్రం వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగగా పోలీసులు బందోబస్తు కోసం వెళ్లిన సమయంలో జంతు బలి జరిగింది.
Similar News
News October 4, 2025
గోనె సంచులను అందించేందుకు చర్యలు: జేసీ

మిల్లర్ల నుండి నాణ్యమైన గోనె సంచులను సేకరించి రైతులకు అందించేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని జేసి రాహుల్ అన్నారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్ల మండలాల వారీగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, వివాదాలకు తావు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జేసి అన్నారు.
News October 4, 2025
విశాఖ అభివృద్ధికి వైసీపీ అడ్డంకి: గంటా

రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రూ.55 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్‌ను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తమ బినామీల భూములను కాపాడుకునేందుకే రైతుల పేరుతో కోర్టులో కేసులు వేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
News October 4, 2025
సత్తా చాటిన ముత్తుకూరు యువకులు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన క్రీడాకారులు టెన్నిస్ బాల్ T10 అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత్ తరఫున ప్రకాశ్, నాగేంద్ర ఎంపికయ్యారు. డిసెంబర్ 25 నుంచి 31 వరకు థాయిలాండ్ జరగబోయే సెకండ్ ఏసియన్ టెన్నిస్ బాల్ T10 క్రికెట్ ఛాంపియన్షిప్‌లో పాల్గొంటారు. వీరు ఇంతకుముందు ఒరిస్సాలో సెప్టెంబర్ 9న జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనపరిచారు.