News October 3, 2025
క్యారవాన్ టూరిజన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు: కలెక్టర్

జిల్లాకు వచ్చే పర్యాటకులు అద్భుతమైన అనుభూతి పొందేలా చర్యలు తీసుకుంటామని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో క్యారవాన్ బస్సును పరిశీలించారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా క్యారవాన్ టూరిజం రానున్న రోజుల్లో నూతన వరవడిని చూపుతుందన్నారు. క్యారవాన్ టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ బస్సు సూర్యలంక బీచ్‌లో శని, ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు.
Similar News
News October 4, 2025
వరంగల్: మద్యం టెండర్లకు మందకొడిగా దరఖాస్తులు

ఉమ్మడి WGL జిల్లాలో 294 మద్యం దుకాణాలకు గతనెల 26 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో ప్రభుత్వం ఆశించినమేర దరఖాస్తులు రావడంలేదు. శుక్రవారం వరకు కేవలం 8 దరఖాస్తులే రావడం గమనార్హం. WGL జిల్లాలో 57 షాపులకుగాను 3, HNK 67 షాపులకు 1, JNGలో 50 షాపులకు 2, MHBDలో 61 షాపులకు 2, MLG, BPL జిల్లాలకు 59 షాపులకు ఒక్క దరఖాస్తూ రాలేదు. ఈనెల 18 దరఖాస్తులకు చివరి తేదీ.
News October 4, 2025
మెదక్: బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

మెదక్ నుంచి ముక్త భూపతిపూర్ వెళ్లే తాత్కాలిక బ్రిడ్జి రోడ్డు నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో వర్షాలు, వరదల కారణంగా బ్రిడ్జి దెబ్బతినడంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు.
News October 4, 2025
బాసర అమ్మవారిని దర్శించుకున్న డీఈఓ

నిర్మల్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) దర్శనం భోజన్న శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి ప్రసిద్ధ బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉపాధ్యాయులు కొక్కుల గంగాధర్ తదితరులు ఉన్నారు.