News October 3, 2025
అనిల్ అంబానీ పిటిషన్‌ను కొట్టేసిన బాంబే హైకోర్టు

తన కంపెనీ అకౌంట్లను ‘ఫ్రాడ్’గా వర్గీకరిస్తూ SBI ఇచ్చిన ఆర్డర్‌ను కొట్టేయాలని Reliance(ADA)Group ఛైర్మన్ అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంటు, అంతర్గత విధానాలపై RBI ఆదేశాల ప్రకారం అనిల్ కంపెనీ అకౌంట్లను బ్యాంకు జూన్‌లో ఫ్రాడ్‌గా పేర్కొంది. అయితే ముందుగా తన వాదనలను వినలేదని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అనిల్ తరఫు లాయర్లు వాదించారు.
Similar News
News October 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 4, 2025
మంగళగిరి వద్ద ROB నిర్మాణానికి రైల్వే ఆమోదం

AP: మంగళగిరి-కృష్ణా కాలువ స్టేషన్ల మధ్య రూ.112 కోట్లతో ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళగిరి డాన్‌బాస్కో స్కూల్ సమీపంలో ఈ నిర్మాణం జరగనుంది. జాతీయ రహదారి నుంచి రాజధాని E13 రోడ్డును కలుపుతూ వంతెన నిర్మాణానికి డిజైన్ చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 6 లైన్ల ROB నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
News October 4, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 04, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.05 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.23 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
✒ ఇష: రాత్రి 7.15 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.