News October 3, 2025
హనుమకొండ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు శుక్రవారం సాయంత్రం హనుమకొండలోని ప్రైవేట్ దవాఖానలో మృతి చెందాడు.రాయపర్తి(M)పన్యానాయక్ తండాకు చెందిన నునావత్ కిషన్ నాయక్ కుమారుడైన నునావత్ గణేశ్(17) HYDలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన గణేశ్ ఈనెల1న తమ బైక్ పై కిష్టాపురం క్రాస్ రోడ్డుకు వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి జారిపడి గాయపడ్డాడు. దవాఖానలో మృతిచెందాడు.
Similar News
News October 4, 2025
అక్టోబర్ 4: చరిత్రలో ఈరోజు

1911: సినీ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు జననం
1957: మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను ప్రయోగించిన సోవియట్ యూనియన్
1977: నటి సంఘవి జననం
1997: క్రికెటర్ రిషభ్ పంత్ జననం(ఫొటోలో)
1947: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత మాక్స్ ప్లాంక్ మరణం
2015: సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మరణం
* అంతర్జాతీయ జంతు దినోత్సవం
News October 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 4, 2025
మంగళగిరి వద్ద ROB నిర్మాణానికి రైల్వే ఆమోదం

AP: మంగళగిరి-కృష్ణా కాలువ స్టేషన్ల మధ్య రూ.112 కోట్లతో ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళగిరి డాన్‌బాస్కో స్కూల్ సమీపంలో ఈ నిర్మాణం జరగనుంది. జాతీయ రహదారి నుంచి రాజధాని E13 రోడ్డును కలుపుతూ వంతెన నిర్మాణానికి డిజైన్ చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 6 లైన్ల ROB నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.