News October 3, 2025
VZM: ‘ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం’

భారీ వర్షాల పట్ల అప్రమతంగా ఉండాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డిని ఆదేశించారు. శుక్రవారం వర్షం నష్టంపై జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నామని, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
Similar News
News October 4, 2025
VZM: 2 రోజుల్లో రూ.12.50 కోట్ల మద్యం తాగేశారు..!

విజయనగరం జిల్లాలో దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. అక్టోబర్ 2న విజయదశమి రోజే గాంధీ జయంతి కావడంతో మద్యం షాపులుకు సెలవు ప్రకటించింది. దీంతో మందుబాబులు సెప్టెంబర్ 30, అక్టోబరు 1వ తేదీల్లో వైన్ షాపుల ముందు క్యూ కట్టి మద్యం కొనుగోలు చేశారు. రెండురోజుల్లో రూ.12.50 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
News October 3, 2025
డెంకాడ మీదుగా సిరిమానోత్సవానికి రాబోయే వారికి SP సూచనలు

డెంకాడ, నాతవలస, శ్రీకాకుళం, భోగాపురం పరిసర ప్రాంతాల నుంచి సిరిమానోత్సవం నిమిత్తం వాహనాల్లో వచ్చే వారు రాజీవ్ నగర్ కాలనీ జంక్షన్, దాసన్నపేట జంక్షన్ మీదుగా అయ్యకోనేరు వద్దకు చేరుకోవాలని SP దామోదర్ తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం లేదా రాజీవ్ నగర్ జంక్షన్ మీదుగా రింగ్ రోడ్డుమీదుగా పోర్ట్ సిటీ స్కూల్, SVN లేఔట్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉందన్నారు.
News October 3, 2025
విజయనగరం ఎస్పీతో ఎంపీ, ఎమ్మెల్యే భేటీ

విజయనగరం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ దామోదర్‌తో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు శుక్రవారం భేటీ అయ్యారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు గురించి ఈ సందర్భంగా చర్చించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని, భక్తుల దర్శనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. దొంగతనాలు జరగకుండా అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.