News October 3, 2025
రోహిత్, కోహ్లీ వచ్చేస్తున్నారు!

ఈనెల 19 నుంచి AUSతో జరగనున్న వన్డే సిరీస్‌కు రేపు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ వన్డేలు మినహా టెస్ట్, టీ20ల నుంచి రిటైరైన విషయం తెలిసిందే. దీంతో AUSతో మ్యాచులకు జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. చాలారోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్న ‘రోకో’ జోడీని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు కెప్టెన్‌గా రోహిత్‌ను కొనసాగిస్తారా లేక మరొకరికి ఛాన్స్ ఇస్తారా? అనేది చూడాలి.
Similar News
News October 4, 2025
బందీల విడుదలకు హమాస్ అంగీకారం

ఇజ్రాయెలీ బందీలు(మృతులు/బతికున్నవారు) అందరినీ రిలీజ్ చేసేందుకు హమాస్ అంగీకరించింది. ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే మధ్యవర్తుల ద్వారా ఈ ప్లాన్‌పై చర్చించాలని ప్రకటన రిలీజ్ చేసింది. అరబ్, ఇస్లామిక్ తదితర దేశాలు, ట్రంప్ ప్రయత్నాలను స్వాగతిస్తున్నామంది. అధికారం వదిలేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2023 OCTలో మొదలైన వార్‌కు త్వరలో తెరపడే అవకాశముంది.
News October 4, 2025
అభివృద్ధికి అడ్డుపడుతూ వైసీపీ సైకోయిజం: గంటా

AP: రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ YCP సైకోయిజాన్ని ప్రదర్శిస్తోందని TDP MLA గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. ‘ప్రభుత్వం 15 నెలల్లో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. ఇది జీర్ణించుకోలేక ప్రాజెక్టులు అడ్డుకునేందుకు YCP కుట్రలు చేస్తోంది. విశాఖలో TCSకు ఎకరా 99 పైసలకే ఇచ్చారని హైకోర్టుకెళ్లి మొట్టికాయలు తిన్నారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్‌ను ఆపాలని చూస్తున్నారు’ అని ఓ ప్రకటనలో విమర్శించారు.
News October 4, 2025
అక్టోబర్ 4: చరిత్రలో ఈరోజు

1911: సినీ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు జననం
1957: మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను ప్రయోగించిన సోవియట్ యూనియన్
1977: నటి సంఘవి జననం
1997: క్రికెటర్ రిషభ్ పంత్ జననం(ఫొటోలో)
1947: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత మాక్స్ ప్లాంక్ మరణం
2015: సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మరణం
* అంతర్జాతీయ జంతు దినోత్సవం