News October 3, 2025

శ్రీకాళహస్తి నేతలకు ఊహించని షాక్

image

శ్రీకాళహస్తి ఆలయ బోర్డు <<17906968>>సభ్యత్వంపై <<>>ఆశపెట్టుకున్న లోకల్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బోర్డులో స్థానికులు ఆరుగురికే చోటు దక్కింది. మిగిలిన 11 మంది(మొత్తం 17మంది సభ్యులు) వేరే జిల్లాలకు చెందిన వాళ్లు ఉన్నారు. గత ప్రభుత్వంలో 80 శాతం లోకల్ వాళ్లు, 20 శాతం బయట వారికి బోర్డులో అవకాశం కల్పించారు. బోర్డు ఛైర్మన్‌గా జనసేన నేత కొట్టే సాయి నియమితులైన విషయం తెలిసిందే

Similar News

News October 4, 2025

అక్టోబర్ 7న శబరి స్మృతి యాత్ర: ఆలయ ఈవో దామోదర్

image

భద్రాచలం దేవస్థానంలో అక్టోబర్ 7న ‘శబరి స్మృతి యాత్ర’ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో దామోదర్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరాల మాదిరిగానే ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాత్రలో పాల్గొనే గిరిజనులను వారి స్వగ్రామాలకు చేర్చడానికి బస్సులను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

News October 4, 2025

నేడు ఎడపల్లిలో సద్దుల బతుకమ్మ…65 ఏళ్లుగా ఆనవాయితీ

image

పండగపూట ఇంట్లో ఆడపడుచులు వుంటే ఆనందం రెట్టింపు అవుతోందని ఆలస్యంగానైనా వారి సమక్షంలో పండగ జరుపుకోవాలనే సంప్రదాయం ఎడపల్లిలో ఆనవాయితీగా కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా దసరా పండగకు ముందు బతుకమ్మ పండగను నిర్వహిస్తారు. కానీ ఎడపల్లి మండల కేంద్రంలో మాత్రం అలా జరుపుకోరు. దసరా అనంతరం 5రోజులకు అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 65 ఏండ్లకు పైగా వస్తున్న ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.

News October 4, 2025

బందీల విడుదలకు హమాస్ అంగీకారం

image

ఇజ్రాయెలీ బందీలు(మృతులు/బతికున్నవారు) అందరినీ రిలీజ్ చేసేందుకు హమాస్ అంగీకరించింది. ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే మధ్యవర్తుల ద్వారా ఈ ప్లాన్‌పై చర్చించాలని ప్రకటన రిలీజ్ చేసింది. అరబ్, ఇస్లామిక్ తదితర దేశాలు, ట్రంప్‌ ప్రయత్నాలను స్వాగతిస్తున్నామంది. అధికారం వదిలేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2023 OCTలో మొదలైన వార్‌కు త్వరలో తెరపడే అవకాశముంది.