News October 4, 2025

HYD: కిరాతకంగా చంపి.. వాటర్‌ ట్యాంకు‌లో పడేశారు.!

image

మాదన్నపేటలో ఏడేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో అల్లరి చేస్తుందనే కోపంతో మేనమామ, అత్త కలిసి బాలికను కిరాతకంగా చంపినట్లు తేలింది. చేతులు, కాళ్లు కట్టేసి, నోటికి ప్లాస్టర్‌ వేసి వాటర్‌ ట్యాంకులో పడేశారని పోలీసులు తెలిపారు. బాలిక తల్లితో కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Similar News

News October 4, 2025

విజయనగరంలో పైడిమాంబ ఇలా వెలిశారంట..!

image

విజయనగరం, బొబ్బిలి రాజులకు మధ్య 1757 జనవరి 24న జరిగిన యుద్ధంలో <<17901456>>పైడిమాంబ<<>> అన్న విజయరామరాజు యుద్ధానికి వెళ్తుండగా వద్దని అమ్మ వారించారు. పంతం మీద యుద్ధానికి వెళ్లిన అన్న మృతి వార్త విని పైడితల్లమ్మ పెద్ద చెరువులో దూకి ప్రాణత్యాగం చేశారు. అనంతరం పతివాడ అప్పలనాయుడు అనే వ్యక్తికి కలలో కనిపించి చెరువులో ప్రతిమగా వెలిసినట్లు చెప్పగా ఆయన వెలికి తీయించారు. అదే ఇప్పుడు వనం గుడిగా మారింది.

News October 4, 2025

సకల సంపదలు ఉన్నా.. భక్తి లేకపోతే శూన్యమే!

image

భగవద్భక్తి హీనస్య జాత్యాశ్శాస్త్రంజపస్తప:॥
అప్రాణస్యైవ దేహస్య మండనంలోకరంజనమ్॥
అని ‘భక్తి వేదం’ తెలుపుతోంది. అంటే.. దేవునిపై భక్తి లేకపోతే, మనిషి ఎన్ని గొప్ప పనులు చేసినా అది వ్యర్థమే. ఎంత ధనం ఉన్నా, విద్యావంతులైనా, గొప్ప వంశంలో పుట్టినా.. దైవభక్తి లేకపోతే అవన్నీ ప్రాణం లేని దేహానికి అలంకరణ చేసినంత వ్యర్థం అనేది ఈ శ్లోక తాత్పర్యం. దేనిలోనైనా భగవద్భక్తి ఉండడమే ముఖ్యమని ఈ శ్లోకం చెబుతోంది. <<-se>>#daivam<<>>

News October 4, 2025

సిరిమానోత్సవంలో బెస్తవారి వల ఎలా వచ్చింది..?

image

ఉత్తరాంధ్ర కల్పవల్లి <<17901808>>పైడితల్లమ్మ<<>> సిరిమాను ఘట్టం ఈనెల 7న జరగనున్న సంగతి తెలిసిందే. సిరిమాను రథం ముందు బెస్తవారి వల తిరుగుతుంటుంది. పెద్ద చెరువులో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని వల సహాయంతో పలువురు మత్స్యకారులు ఏమీ ఆశించకుండానే అప్పట్లో వెలికి తీశారని చెబుతుంటారు. దీంతో అప్పటిలో రాజులు ఏటా జరిగే సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకు అంగీకరించారు. నేటికీ ఆ సంప్రదాయమే కొనసాగుతోంది.