News October 4, 2025
KNR: అందరి దృష్టి కోర్టు తీర్పు పైనే..!

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీచేసి ఈనెల 9న నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తుంది. ఐతే ఈనెల 8న బీసీ రిజర్వేషన్ల పై కోర్టులో విచారణ జరుగనుంది. ఏ తీర్పు వస్తుందోనని ప్రభుత్వానికి, ఆశావాహులకు దడ పెరుగుతుంది. దీంతో రిజర్వేషన్ల చుట్టూనే రాజకీయాలు తిరుగుతుండగా, ఆశావహులు నిరాశలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646ఎంపీటీసీ స్థానాలున్నాయి.
Similar News
News October 4, 2025
విజయనగరంలో పైడిమాంబ ఇలా వెలిశారంట..!

విజయనగరం, బొబ్బిలి రాజులకు మధ్య 1757 జనవరి 24న జరిగిన యుద్ధంలో <<17901456>>పైడిమాంబ<<>> అన్న విజయరామరాజు యుద్ధానికి వెళ్తుండగా వద్దని అమ్మ వారించారు. పంతం మీద యుద్ధానికి వెళ్లిన అన్న మృతి వార్త విని పైడితల్లమ్మ పెద్ద చెరువులో దూకి ప్రాణత్యాగం చేశారు. అనంతరం పతివాడ అప్పలనాయుడు అనే వ్యక్తికి కలలో కనిపించి చెరువులో ప్రతిమగా వెలిసినట్లు చెప్పగా ఆయన వెలికి తీయించారు. అదే ఇప్పుడు వనం గుడిగా మారింది.
News October 4, 2025
సకల సంపదలు ఉన్నా.. భక్తి లేకపోతే శూన్యమే!

భగవద్భక్తి హీనస్య జాత్యాశ్శాస్త్రంజపస్తప:॥
అప్రాణస్యైవ దేహస్య మండనంలోకరంజనమ్॥
అని ‘భక్తి వేదం’ తెలుపుతోంది. అంటే.. దేవునిపై భక్తి లేకపోతే, మనిషి ఎన్ని గొప్ప పనులు చేసినా అది వ్యర్థమే. ఎంత ధనం ఉన్నా, విద్యావంతులైనా, గొప్ప వంశంలో పుట్టినా.. దైవభక్తి లేకపోతే అవన్నీ ప్రాణం లేని దేహానికి అలంకరణ చేసినంత వ్యర్థం అనేది ఈ శ్లోక తాత్పర్యం. దేనిలోనైనా భగవద్భక్తి ఉండడమే ముఖ్యమని ఈ శ్లోకం చెబుతోంది. <<-se>>#daivam<<>>
News October 4, 2025
సిరిమానోత్సవంలో బెస్తవారి వల ఎలా వచ్చింది..?

ఉత్తరాంధ్ర కల్పవల్లి <<17901808>>పైడితల్లమ్మ<<>> సిరిమాను ఘట్టం ఈనెల 7న జరగనున్న సంగతి తెలిసిందే. సిరిమాను రథం ముందు బెస్తవారి వల తిరుగుతుంటుంది. పెద్ద చెరువులో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని వల సహాయంతో పలువురు మత్స్యకారులు ఏమీ ఆశించకుండానే అప్పట్లో వెలికి తీశారని చెబుతుంటారు. దీంతో అప్పటిలో రాజులు ఏటా జరిగే సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకు అంగీకరించారు. నేటికీ ఆ సంప్రదాయమే కొనసాగుతోంది.