News October 4, 2025

AP, TG న్యూస్ రౌండప్

image

☛ రేపు HYDకు AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చ
☛ మంగళగిరి-కృష్ణా కాలువ స్టేషన్ల మధ్య రూ.112 కోట్లతో ROB నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్
☛ నవంబర్ 5 నుంచి 9 వరకు కడప దర్గా ఉరుసు మహోత్సవం
☛ TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపు పునః ప్రారంభం

Similar News

News October 4, 2025

విష్ణు సహస్రనామ పఠనం చేస్తున్నారా?

image

విష్ణు సహస్ర నామాన్ని కేవలం పూజ, పఠనం లేదా పారాయణము చేసేటప్పుడు ఎలాంటి ప్రత్యేక రుద్రశాప విమోచన అవసరం లేదు. భక్తితో రోజువారీగా చదువుకోవచ్చు. కానీ, అదే సహస్ర నామాన్ని ఒక మంత్రానుష్టానంగా (అనగా, శక్తిమంతమైన మంత్రంగా) జపించి సిద్ధి పొందాలనుకుంటే, అప్పుడు గురువు నుంచి మంత్రోపదేశం ద్వారా రుద్రశాప విమోచనాన్ని స్వీకరించడం అత్యవసరం. దీనివల్ల సంపూర్ణ ఫలితం కలుగుతుంది.

News October 4, 2025

కొత్త రూల్స్.. ఇక గంటల్లోనే చెక్కులు క్లియర్

image

చెక్కులకు సంబంధించి నేటి నుంచి RBI కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. గతంలో ఒకటి, రెండు పని దినాలు పట్టే చెక్కులు ఇక కొన్ని గంటల్లోనే క్లియర్ కానున్నాయి. చెక్కు ట్రంకేషన్ సిస్టం ఆధారంగా ఈ కొత్త పద్ధతి పనిచేస్తుంది. చెక్కును ఫిజికల్‌గా బ్యాంకుకు పంపాల్సిన అవసరం ఉండదు. దాని ఫొటో, వివరాలు పంపితే వెంటనే క్లియర్ అవుతాయి. అటు చెక్కుల భద్రతను పెంచడానికి పాజిటివ్ పే సిస్టమ్‌ను RBI తప్పనిసరి చేసింది.

News October 4, 2025

సకల సంపదలు ఉన్నా.. భక్తి లేకపోతే శూన్యమే!

image

భగవద్భక్తి హీనస్య జాత్యాశ్శాస్త్రంజపస్తప:॥
అప్రాణస్యైవ దేహస్య మండనంలోకరంజనమ్॥
అని ‘భక్తి వేదం’ తెలుపుతోంది. అంటే.. దేవునిపై భక్తి లేకపోతే, మనిషి ఎన్ని గొప్ప పనులు చేసినా అది వ్యర్థమే. ఎంత ధనం ఉన్నా, విద్యావంతులైనా, గొప్ప వంశంలో పుట్టినా.. దైవభక్తి లేకపోతే అవన్నీ ప్రాణం లేని దేహానికి అలంకరణ చేసినంత వ్యర్థం అనేది ఈ శ్లోక తాత్పర్యం. దేనిలోనైనా భగవద్భక్తి ఉండడమే ముఖ్యమని ఈ శ్లోకం చెబుతోంది. <<-se>>#daivam<<>>