News October 4, 2025

హైవేలపై పొలిటికల్ రోడ్‌ షోలు, ర్యాలీపై మద్రాస్ HC నిషేధం

image

TNలోని కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని స్టేట్, నేషనల్ హైవేలపై పొలిటికల్ రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధించింది. స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOPs) నిబంధనలు రూపొందించే వరకు ఈ బ్యాన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కరూర్‌ లాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా స్పష్టమైన నిబంధనలు రూపొందించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో ఈ తీర్పిచ్చింది.

Similar News

News October 4, 2025

ఈ గ్రామాల్లో ఎన్నికలు బంద్!

image

TG: రాష్ట్రంలోని పలు చోట్ల సుప్రీంకోర్టు కేసుల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడనుంది. వివిధ జిల్లాల్లో మొత్తం 14 MPTC స్థానాలు, 27 సర్పంచ్, 256 వార్డులు ఎన్నికలకు దూరం కానున్నాయి. ములుగు(D) మంగపేట(M)లో 14 MPTCలు, 25 సర్పంచ్‌లు, 230 వార్డులకు 15 ఏళ్ల నుంచి ట్రైబల్, నాన్ ట్రైబల్ పంచాయితీ వల్ల ఎన్నికలు జరగడం లేదు. KNRలో 2, మంచిర్యాలలోని గూడెం ఈసారి కూడా ఎలక్షన్స్‌కు దూరం కానున్నాయి.

News October 4, 2025

నేషనల్ హైవేలకు క్యూఆర్ కోడ్‌లు

image

వాహనదారులకు ఉపయోగపడే సమాచారాన్ని తెలిపేందుకు నేషనల్ హైవేల పొడవునా క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు NHAI తెలిపింది. రోడ్ ప్రాజెక్టు వివరాలు, అత్యవసర నంబర్లు, NHAI ఆఫీస్‌లు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, పంక్చర్ రిపేర్ షాపులు, టోల్‌ప్లాజా దూరం, వాహన సర్వీస్, ఛార్జింగ్ స్టేషన్లు తదితర వివరాలను ఇవి తెలియజేస్తాయి. ఇందుకు సంబంధించిన సైన్ బోర్డులను పలు చోట్ల ఏర్పాటు చేస్తారు.

News October 4, 2025

విష్ణు సహస్రనామ పఠనం చేస్తున్నారా?

image

విష్ణు సహస్ర నామాన్ని కేవలం పూజ, పఠనం లేదా పారాయణము చేసేటప్పుడు ఎలాంటి ప్రత్యేక రుద్రశాప విమోచన అవసరం లేదు. భక్తితో రోజువారీగా చదువుకోవచ్చు. కానీ, అదే సహస్ర నామాన్ని ఒక మంత్రానుష్టానంగా (అనగా, శక్తిమంతమైన మంత్రంగా) జపించి సిద్ధి పొందాలనుకుంటే, అప్పుడు గురువు నుంచి మంత్రోపదేశం ద్వారా రుద్రశాప విమోచనాన్ని స్వీకరించడం అత్యవసరం. దీనివల్ల సంపూర్ణ ఫలితం కలుగుతుంది.