News October 4, 2025
HEADLINES

* కడపలో 2028లోగా జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి: CM CBN
* కూటమిది దద్దమ్మ ప్రభుత్వం: YCP
* రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసం: KTR
* స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు TG ఎన్నికల సంఘం ప్రకటన
* ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
* పాక్‌ను ప్రపంచ పటం నుంచి లేపేస్తాం: ఆర్మీ చీఫ్
* WIతో టెస్ట్.. రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు
Similar News
News October 4, 2025
ఈ గ్రామాల్లో ఎన్నికలు బంద్!

TG: రాష్ట్రంలోని పలు చోట్ల సుప్రీంకోర్టు కేసుల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడనుంది. వివిధ జిల్లాల్లో మొత్తం 14 MPTC స్థానాలు, 27 సర్పంచ్, 256 వార్డులు ఎన్నికలకు దూరం కానున్నాయి. ములుగు(D) మంగపేట(M)లో 14 MPTCలు, 25 సర్పంచ్‌లు, 230 వార్డులకు 15 ఏళ్ల నుంచి ట్రైబల్, నాన్ ట్రైబల్ పంచాయితీ వల్ల ఎన్నికలు జరగడం లేదు. KNRలో 2, మంచిర్యాలలోని గూడెం ఈసారి కూడా ఎలక్షన్స్‌కు దూరం కానున్నాయి.
News October 4, 2025
నేషనల్ హైవేలకు క్యూఆర్ కోడ్‌లు

వాహనదారులకు ఉపయోగపడే సమాచారాన్ని తెలిపేందుకు నేషనల్ హైవేల పొడవునా క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు NHAI తెలిపింది. రోడ్ ప్రాజెక్టు వివరాలు, అత్యవసర నంబర్లు, NHAI ఆఫీస్‌లు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, పంక్చర్ రిపేర్ షాపులు, టోల్‌ప్లాజా దూరం, వాహన సర్వీస్, ఛార్జింగ్ స్టేషన్లు తదితర వివరాలను ఇవి తెలియజేస్తాయి. ఇందుకు సంబంధించిన సైన్ బోర్డులను పలు చోట్ల ఏర్పాటు చేస్తారు.
News October 4, 2025
విష్ణు సహస్రనామ పఠనం చేస్తున్నారా?

విష్ణు సహస్ర నామాన్ని కేవలం పూజ, పఠనం లేదా పారాయణము చేసేటప్పుడు ఎలాంటి ప్రత్యేక రుద్రశాప విమోచన అవసరం లేదు. భక్తితో రోజువారీగా చదువుకోవచ్చు. కానీ, అదే సహస్ర నామాన్ని ఒక మంత్రానుష్టానంగా (అనగా, శక్తిమంతమైన మంత్రంగా) జపించి సిద్ధి పొందాలనుకుంటే, అప్పుడు గురువు నుంచి మంత్రోపదేశం ద్వారా రుద్రశాప విమోచనాన్ని స్వీకరించడం అత్యవసరం. దీనివల్ల సంపూర్ణ ఫలితం కలుగుతుంది.