News October 4, 2025
HYDను ‘కల్తీ’ కరాబ్ చేసిందా?

వరల్డ్ బెస్ట్ బిర్యానీ, వరల్డ్ ఫేమస్ హలీం HYD సొంతం. గూగుల్‌లో సెర్చ్ చేసినా ఇదే వస్తది. రుచుల్లో ఆహా.. ఓహో అని గొప్ప కథనాలు ఉంటాయి. మరి ఇదంతా ఉత్తిదేనా? అనేలా జొమాటో రూపొందించిన ‘కాండే నాస్ట్ IND’ నివేదిక ఉంది. INDలోని టాప్-50 రెస్టారెంట్లలో HYD ఊసేలేదు. వాస్తవానికి ఇటీవల ఆహార నాణ్యతపై నగరంలో ఫిర్యాదులు పెరిగాయి. ఈ కల్తీ ఏమైనా దెబ్బతీసిందా? అని సిటిజనులు ఆలోచనలో పడ్డారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 4, 2025
HYD: వైట్‌రైస్, చక్కెర తింటున్నారా? జాగ్రత్త!

నగరవాసులకు లైఫ్‌స్టైల్, ఆహార అలవాట్లతో హైకొలెస్ట్రాల్, BP, ఊబకాయం, షుగర్ కామన్ అయ్యాయని ICMR తాజా సర్వే కుండబద్ధలు కొట్టింది. వైట్‌రైస్, రీఫైన్డ్ గోధుమలు, చక్కెర, హైకార్బ్స్ ఉండే ఫుడ్డే దీనికి కారణం. 40ఏళ్లలోపువారిపై చేసిన సర్వేలో పొట్టచుట్టూ కొవ్వు 36%మందిలో హార్ట్ డిసీజ్, ప్రీడయాబెటీస్‌కు కారకం అవుతోంది. వ్యాయామంచేయాలని, కూరగాయలు, ప్రోటీన్ ఫుడ్స్ డయాబెటీస్‌పై వ్యతిరేకంగా పనిచేస్తాయని పేర్కొంది.
News October 4, 2025
HYD: మహిళల్లో థైరాయిడ్.. ఇలా చేయండి

మేడ్చల్ మల్కాజిగిరిలో స్వస్త్ నారీ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా మహిళలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. చాలా మందిలో థైరాయిడ్‌ను గుర్తించామని డా.శ్రీదేవి వెల్లడించారు. అధిక బరువు ఉన్న వారిలో ఈ సమస్య ఉందన్నారు. లైఫ్‌స్టైల్ ఛేంజస్‌తో గాడిలో పెట్టొచ్చు. నిత్యం 3KM నడక, సీఫుడ్స్, సీడ్స్& నట్స్, సెలీనయం ఉండే ఆహారం తీసుకోవాలి. సమయానికి మంచి నిద్ర, ఆహారానికి నిద్రకు మధ్య కనీసం 2గంటల గ్యాప్ ఉండాలని వివరించారు.
News October 4, 2025
HYD: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ విద్యతో పాటు క్రీడలు, విలువల ఆధారిత బోధన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంచేలా విద్యావిధానం ఉంటుంది. మరిన్ని వివరాలకు 9059196161 ద్వారా లేదా yipschool.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల యాజమాన్యం తెలిపింది.