News October 4, 2025

మంగళగిరి వద్ద ROB నిర్మాణానికి రైల్వే ఆమోదం

image

AP: మంగళగిరి-కృష్ణా కాలువ స్టేషన్ల మధ్య రూ.112 కోట్లతో ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళగిరి డాన్‌బాస్కో స్కూల్ సమీపంలో ఈ నిర్మాణం జరగనుంది. జాతీయ రహదారి నుంచి రాజధాని E13 రోడ్డును కలుపుతూ వంతెన నిర్మాణానికి డిజైన్ చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 6 లైన్ల ROB నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.

Similar News

News October 4, 2025

మీ పూజ గదిలో ఈ వస్తువులు ఉన్నాయా?

image

పూజ గదిలో సాధారణ పూజ సామగ్రితో పాటు కొన్ని పవిత్ర వస్తువులు ఉంటే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దేవుళ్ల చిత్రపటాలతో పాటు గోమాత పటం కూడా ఉండాలని అంటున్నారు. శంఖం, సాలగ్రామం, తామర గింజలు, గవ్వలు, గంగాజలం, నెమలి పింఛం, భగవద్గీత పుస్తకం ముఖ్యమని సూచిస్తున్నారు. వీలైతే గంధపు చెక్కను కూడా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఇవి దివ్య శోభను, సానుకూల శక్తిని ఇచ్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతాయి.<<-se>>#pooja<<>>

News October 4, 2025

ఫస్ట్ ఉమెన్ లాయర్ ‘కార్నేలియా’

image

మహిళలు ఇంటికే పరిమితమైన రోజుల్లో లండన్ వెళ్లి న్యాయశాస్త్రం అభ్యసించారు కార్నేలియా సొరాబ్జీ. నాసిక్‌లో 1866లో జన్మించిన ఈమె బాంబే వర్సిటీలో డిగ్రీ చేసిన తొలి మహిళగా నిలిచారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో లా చదివిన తొలి భారత మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు. మహిళలు లాయర్ వృత్తిని చేపట్టడానికి అనుమతి వచ్చాక 1924లో బారిస్టర్‌గా గుర్తింపుపొందారు. ఈమె పేదల తరఫున వందల కేసులను ఉచితంగా వాదించారు.<<-se>>#FirstWomen<<>>

News October 4, 2025

విశాఖలో HSBC బ్యాంకు!

image

AP: అతిపెద్ద విదేశీ బ్యాంకు HSBC వైజాగ్‌లో తమ బ్రాంచ్ ఏర్పాటు చేయనుంది. విశాఖతో పాటు దేశంలోని 20 ప్రాంతాల్లో తమ శాఖలను విస్తరించేందుకు RBI అనుమతిచ్చిందని HSBC వెల్లడించింది. అనువైన ప్రాంతంలో భవనం దొరగ్గానే విశాఖలో బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని ఆ బ్యాంక్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ ప్రీమియం బ్యాంకింగ్ విభాగం హెడ్ సందీప్ బాత్రా తెలిపారు. ఈ 20 శాఖలు ఏర్పాటైతే దేశంలో తమ బ్రాంచుల సంఖ్య 46కు చేరుతుందన్నారు.