News October 4, 2025
అక్టోబర్ 4: చరిత్రలో ఈరోజు

1911: సినీ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు జననం
1957: మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను ప్రయోగించిన సోవియట్ యూనియన్
1977: నటి సంఘవి జననం
1997: క్రికెటర్ రిషభ్ పంత్ జననం(ఫొటోలో)
1947: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత మాక్స్ ప్లాంక్ మరణం
2015: సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మరణం
* అంతర్జాతీయ జంతు దినోత్సవం
Similar News
News October 4, 2025
అక్టోబర్ 15 వరకు గడువు

‘AP బ్రాండ్ అంబాసిడర్’ నమోదుకు ముగింపు గడువు దగ్గర పడుతోంది. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్ర విజన్-2047లో యువతను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2K25’ డిజిటల్ మారథాన్‌కు ఆహ్వానం పలికింది. SEP 30తోనే గడువు ముగియగా, కాలేజీల విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు గడువును OCT 15 వరకు పొడిగించారు. ఇప్పటికే ఈ <
News October 4, 2025
DAY-3: భారత్ డిక్లేర్డ్

IND vs WI: అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసి నిన్న రెండో రోజు ఆట ముగించింది. ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించకుండానే డిక్లేర్ చేసింది. 286 పరుగుల వెనుకంజతో WI సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. నిన్న మన బ్యాటర్లు రాహుల్, జడేజా, జురెల్ సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే.
News October 4, 2025
ఫాస్టింగ్ తర్వాత వెయిట్ పెరగొద్దంటే..

నవరాత్రుల్లో ఉపవాసం తర్వాత ఫుడ్ కంట్రోల్ లేకపోతే చాలా మంది మహిళలు వేగంగా బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరం సాధారణ జీవనశైలికి అలవాటు పడే వరకు మితంగా ఆహారం తీసుకోవాలంటున్నారు. ‘పీచు దొరికే అవకాడో, పండ్లు, నట్స్, పప్పులు, ప్రోబయాటిక్స్ కోసం పెరుగు, ఇడ్లీ/దోసె, తేలికగా జీర్ణమయ్యే, కార్బోహైడ్రేట్స్ తక్కువుండే ఆహారం తినాలి. జంక్‌ఫుడ్, స్వీట్లకు దూరంగా ఉండాలి’ అని సూచిస్తున్నారు.