News October 4, 2025

అభివృద్ధికి అడ్డుపడుతూ వైసీపీ సైకోయిజం: గంటా

image

AP: రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ YCP సైకోయిజాన్ని ప్రదర్శిస్తోందని TDP MLA గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. ‘ప్రభుత్వం 15 నెలల్లో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. ఇది జీర్ణించుకోలేక ప్రాజెక్టులు అడ్డుకునేందుకు YCP కుట్రలు చేస్తోంది. విశాఖలో TCSకు ఎకరా 99 పైసలకే ఇచ్చారని హైకోర్టుకెళ్లి మొట్టికాయలు తిన్నారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్‌ను ఆపాలని చూస్తున్నారు’ అని ఓ ప్రకటనలో విమర్శించారు.

Similar News

News October 4, 2025

DAY-3: భారత్ డిక్లేర్డ్

image

IND vs WI: అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసి నిన్న రెండో రోజు ఆట ముగించింది. ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించకుండానే డిక్లేర్ చేసింది. 286 పరుగుల వెనుకంజతో WI సెకండ్ ఇన్నింగ్స్‌ ఆరంభించింది. నిన్న మన బ్యాటర్లు రాహుల్, జడేజా, జురెల్ సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే.

News October 4, 2025

ఫాస్టింగ్ తర్వాత వెయిట్ పెరగొద్దంటే..

image

నవరాత్రుల్లో ఉపవాసం తర్వాత ఫుడ్ కంట్రోల్ లేకపోతే చాలా మంది మహిళలు వేగంగా బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరం సాధారణ జీవనశైలికి అలవాటు పడే వరకు మితంగా ఆహారం తీసుకోవాలంటున్నారు. ‘పీచు దొరికే అవకాడో, పండ్లు, నట్స్, పప్పులు, ప్రోబయాటిక్స్ కోసం పెరుగు, ఇడ్లీ/దోసె, తేలికగా జీర్ణమయ్యే, కార్బోహైడ్రేట్స్ తక్కువుండే ఆహారం తినాలి. జంక్‌ఫుడ్, స్వీట్లకు దూరంగా ఉండాలి’ అని సూచిస్తున్నారు.

News October 4, 2025

జురెల్ క్రికెట్ జర్నీ అద్భుతం: దినేశ్ కార్తీక్

image

<<17904558>>సెంచరీ<<>> హీరో ధ్రువ్ జురెల్ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ చెప్పారు. ఆయన ప్రయాణం అద్భుతమని కొనియాడారు. కెరీర్ ప్రారంభంలో జురెల్ తల్లి నగలు తాకట్టు పెట్టి క్రికెట్ కిట్ కొనిచ్చారని తెలిపారు. డొమెస్టిక్ టోర్నీల్లో సత్తా చాటి టీమ్ ఇండియాకు ఎంపికయ్యారని గుర్తు చేశారు. తాజాగా అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ టెస్టుల్లో తొలి శతకం బాదారని ప్రశంసించారు.