News October 4, 2025
అక్టోబర్ 7న శబరి స్మృతి యాత్ర: ఆలయ ఈవో దామోదర్

భద్రాచలం దేవస్థానంలో అక్టోబర్ 7న ‘శబరి స్మృతి యాత్ర’ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో దామోదర్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరాల మాదిరిగానే ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాత్రలో పాల్గొనే గిరిజనులను వారి స్వగ్రామాలకు చేర్చడానికి బస్సులను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
Similar News
News October 4, 2025
శివుణ్ని, దక్షుడు ఎందుకు అవమానించాలని అనుకుంటాడు?

బ్రహ్మ కుమారుడే ‘దక్షుడు’. ఆయన ఓ గొప్ప ప్రజాపతి. సంప్రదాయాలు, నియమాలను గౌరవించే వ్యక్తి. ఆయన కూతురు సతీదేవి. ఆమెకు శివుడంటే అమితమైన ప్రేమ. అందుకే ఆయనను వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహం ఆమె తండ్రి దక్షుడికి ఇష్టం ఉండదు. సంప్రదాయానికి పెద్ద పీట వేసే ఆయన శ్మశానాల్లో ఉంటూ.. భస్మం, పులి చర్మం ధరించే శివుణ్ని అల్లుడిగా అంగీకరించడు. అందుకే అవమానించాలని అనుకుంటాడు. <<-se>>#Shakthipeetam<<>>
News October 4, 2025
డబ్బులు పడకపోతే రిపోర్ట్ చేయండి: CBN

AP: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం అమలుతో డ్రైవర్లు పండగ వాతావరణంలో ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. చెప్పిన సమయానికే అకౌంట్లలో డబ్బులు జమ చేశామని చెప్పారు. చరిత్రలో ఎరుగని విధంగా 2024లో 94% సీట్లు కట్టబెట్టారని, రాబోయే రోజుల్లో ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలని సీఎం కోరారు. అర్హుల అకౌంట్లలో డబ్బులు పడకపోతే అధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబ్బులు వేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు.
News October 4, 2025
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింత?

ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు UK ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. నీరవ్ భారత్‌కు వచ్చాక మోసం, మనీలాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారిస్తామని భారత ప్రభుత్వం బ్రిటీష్ అధికారులకు హామీ పత్రం అందజేసింది. అతడికి హై ప్రొఫైల్ ఖైదీలకు అందించే సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది. వీటికి సమ్మతించిన ఆ దేశ ప్రభుత్వం ఈ నెల 23న ఆయన్ను అప్పగించే అవకాశాలున్నాయని జాతీయ మీడియా పేర్కొంది.