News October 4, 2025
NZB: ఉమ్మడి జిల్లా స్థానిక ఎన్నికల్లో వారి తీర్పే కీలకం..!

స్థానిక సమరానికి తెర లేవడంతో ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థుల తలరాతను మార్చే నిర్ణయాధికారం మాత్రం మహిళల చేతుల్లోనే ఉన్నది. NZB, KMR జిల్లాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. NZBజిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య 3,96,778 మంది కాగా, మహిళలు 4,54,621 ఉన్నారు. ఇక KMR జిల్లాలో 3,07,508 మంది పురుషులు , 3,32,209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో రెండు జిల్లాల్లో మహిళల ఆశీస్సులు దక్కిన వారికే విజయం.
Similar News
News October 4, 2025
NZB: రూ.22 కోట్ల మద్యం తాగేశారు..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ దసరా సందర్భంగా రెండు రోజుల్లోనే రూ.22 కోట్లకు పైగా మద్యం విక్రయాలు కొనసాగాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.5 కోట్లు అధికంగా విక్రయాలు కొనసాగినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. NZB జిల్లాలో 102 వైన్ షాపులు, 20 బార్లు, KMR జిల్లాలో 49 వైన్స్ దుకాణాలు, 8 బార్లు ఉండగా నిజామాబాద్ జిల్లాలోని మాదాపూర్ IML డిపో నుంచి రెండు రోజుల్లో రూ.22 కోట్ల మద్యం సరఫరా చేసినట్లు చెప్పారు.
News October 4, 2025
NZB: పోతే రూ.50 వేలు వస్తే రూ. 10 లక్షలు..!

NZB (D)లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. ‘హలో మామ దసరా పండుగ ముగిసింది. ఇక మద్యం టెండర్ల మాటేంటి. టెండర్ వేద్దామా వద్దా.. ఈసారి టెండర్ రూ.3 లక్షల అంట కదా. అదే ఆలోచిస్తున్నాం. నీ వాళ్లు ఎంతమంది ఉన్నారు. నాతో కలిపి మేము ముగ్గురం. మీరు ముగ్గురు. ఆరుగురం కలిసి తలా రూ. 50వేలు వేసుకొని ఒక టెండర్ వేద్దాం. పోతే రూ.50 వేలు, లక్కీగా వస్తే మాత్రం.. దాన్ని అమ్మేస్తే తలా రూ.10 లక్షలు’ అని చర్చించుకుంటున్నారు.
News October 4, 2025
నేడు ఎడపల్లిలో సద్దుల బతుకమ్మ…65 ఏళ్లుగా ఆనవాయితీ

పండగపూట ఇంట్లో ఆడపడుచులు వుంటే ఆనందం రెట్టింపు అవుతోందని ఆలస్యంగానైనా వారి సమక్షంలో పండగ జరుపుకోవాలనే సంప్రదాయం ఎడపల్లిలో ఆనవాయితీగా కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా దసరా పండగకు ముందు బతుకమ్మ పండగను నిర్వహిస్తారు. కానీ ఎడపల్లి మండల కేంద్రంలో మాత్రం అలా జరుపుకోరు. దసరా అనంతరం 5రోజులకు అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 65 ఏండ్లకు పైగా వస్తున్న ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.