News October 4, 2025
సిరిమానోత్సవంలో బెస్తవారి వల ఎలా వచ్చింది..?

ఉత్తరాంధ్ర కల్పవల్లి <<17901808>>పైడితల్లమ్మ<<>> సిరిమాను ఘట్టం ఈనెల 7న జరగనున్న సంగతి తెలిసిందే. సిరిమాను రథం ముందు బెస్తవారి వల తిరుగుతుంటుంది. పెద్ద చెరువులో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని వల సహాయంతో పలువురు మత్స్యకారులు ఏమీ ఆశించకుండానే అప్పట్లో వెలికి తీశారని చెబుతుంటారు. దీంతో అప్పటిలో రాజులు ఏటా జరిగే సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకు అంగీకరించారు. నేటికీ ఆ సంప్రదాయమే కొనసాగుతోంది.
Similar News
News October 4, 2025
శ్రీకాకుళం జిల్లాలో 13,887 మందికి రూ.15 వేల సాయం

ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున నగదును వారి అకౌంట్లలో నేడు జమ చేయనుంది. ఈ వాహన మిత్ర పథకానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 15,341 మంది ఆటో డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,887 మందిని అర్హులుగా గుర్తించారు. వీరి కోసం మొత్తం రూ.21 కోట్ల మేర ప్రభుత్వం నిధులను మంజూరు చేయనుంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ నేడు నగదును జమ సీఎం చంద్రబాబు చేయనున్నారు.
News October 4, 2025
హిరమండలం: గొట్టా బ్యారేజీ వద్ద తగ్గిన వరద ఉద్ధృతి

హిరమండలం మండలంలోని గొట్ట బ్యారేజ్‌లో వరద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు 75 వేల క్యూసెక్కులకు ఉన్న వరద నీరు శనివారం ఉదయం 6 గంటలకు 50 వేల క్యూసెక్కులకు చేరుకుందని డీఈ సరస్వతి తెలిపారు. 2, 3వ ప్రమాద సూచికలు తొలగించామని, ఒకటవ ప్రమాద సూచిక కొనసాగుతుందని ఆమె వివరించారు.
News October 4, 2025
SKLM: ‘27 గ్రామాల్లో 74 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి’

వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 27 గ్రామాల్లో 74 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణమూర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 350 విద్యుత్ మీటర్ల వైర్లు తెగిపడ్డాయని, 5 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయని చెప్పారు. సుమారు రూ.20 లక్షలతో పునరుద్ధరణ పనులు చేశామన్నారు. 600 మంది సిబ్బందిని 300 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని వినియోగించామన్నారు.