News April 6, 2024

గాంధీలో హబ్ అండ్ స్పోక్ కంట్రోల్ కమాండ్ సేవలు

image

డయాలసిస్ సంబంధిత సమస్యతో బాధపడే రోగులకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు నెఫ్రాలజీ విభాగం వైద్యులు తీపి కబురు అందించారు. ఇకపై 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఆయా రోగులకు కంట్రోల్ కమాండ్ ద్వారా వైద్య సేవలు అందేలా ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. 6న ‘హబ్ అండ్ స్పోక్ కంట్రోల్ కమాండ్’ పేరిట గాంధీ ఆసుపత్రిలోని నెఫ్రాలజీ విభాగంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.

Similar News

News December 25, 2024

NEW YEAR: HYDలో రాత్రి 10 దాటితే బంద్!

image

రాజధానిలోని 3 కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
➤ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బంద్
➤ఈవెంట్లకు అనుమతి తప్పనిసరి
➤మైనర్లకు పార్టీల్లో నో ఎంట్రీ
➤ఇండోర్‌‌‌‌‌‌‌‌లోనే మ్యూజికల్ ఈవెంట్స్
➤సౌండ్ పొల్యూషన్ 45 డెసిబుల్స్‌‌‌‌ దాటొద్దు
➤అసభ్యకర డాన్సులు బ్యాన్
డ్రంకెన్ డ్రైవ్‌‌‌‌లో పట్టుబడితే రూ.10,000 FINE, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు.
SHARE IT

News December 25, 2024

హైదరాబాద్‌‌లో OYO‌కు ఫుల్ డిమాండ్!

image

HYD OYO బుకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం.. గల్లీల్లో ఉండే లాడ్జిలను సైతం అధునాతన హంగులతో తీర్చిదిద్ది, అందుబాటు ధరలకే‌ ఇస్తున్నారు. అయితే, నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ ఈ సారి గ్రాండ్‌‌గా నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి మన నగరానికి టూరిస్టులు వస్తుంటారు. దీంతో OYO హోటల్స్‌‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఆయా హాటల్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టడం విశేషం.

News December 25, 2024

HYDలో అర్ధరాత్రి నుంచి సంబరాలు

image

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి పండుగ వాతావరణం నెలకొంది. యేసు పుట్టిన రోజు సందర్భంగా అన్ని చర్చిలను అందంగా అలంకరించారు. స్టార్ ఆకారంలో పలుచోట్ల LED లైట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌లో క్రిస్‌మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే, మిడ్ నైట్ 12 గంటలకు చర్చిలకు వెళ్లిన క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Happy Christmas