News October 4, 2025

నేడు ప్రకాశం జిల్లాకు మోస్తరు వర్షసూచన.!

image

ప్రకాశం జిల్లాలో శనివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించగా, ప్రకాశంకు మాత్రం మోస్తారు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే వర్షాలు కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Similar News

వాహనమిత్ర స్కీమ్.. ప్రకాశంలో అర్హులు ఎంతమందంటే?

image

‘ఆటో డ్రైవర్ల సేవలో’ నూతన పథకాన్ని CM రేపు విజయవాడలో ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లాలో 12493 ఆటో డ్రైవర్లు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్నారు. కాగా వీటిని పరిశీలించిన అధికారులు 11,356 అప్లికేషన్లను మంజూరు చేశారు. వీరి ఖాతాల్లో మొత్తం రూ.17కోట్ల 3లక్షల 40వేల నగదు జమ కానుంది. వివిధ కారణాల వల్ల పలువురిని తొలగించగా, మరికొన్ని హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం. అర్హత గలవారికి రేపు రూ.15 వేలు జమ కానుంది.

News October 4, 2025

ప్రకాశం: ఆధార్ అప్డేట్ చేయాలా.. ఈ ఛాన్స్ మీకోసమే.!

image

ప్రకాశం జిల్లాలో ఈనెల ఆరో తేదీ నుంచి పదవతేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ సూపరిటెండెంట్ మహమ్మద్ జాఫర్ సాదిక్ తెలిపారు. ఒంగోలులో శుక్రవారం స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. తపాలశాఖ ద్వారా ఆధార్ నమోదు ప్రక్రియను సాధించేందుకు ఈనెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.