News October 4, 2025

ఈ గ్రామాల్లో ఎన్నికలు బంద్!

image

TG: రాష్ట్రంలోని పలు చోట్ల సుప్రీంకోర్టు కేసుల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడనుంది. వివిధ జిల్లాల్లో మొత్తం 14 MPTC స్థానాలు, 27 సర్పంచ్, 256 వార్డులు ఎన్నికలకు దూరం కానున్నాయి. ములుగు(D) మంగపేట(M)లో 14 MPTCలు, 25 సర్పంచ్‌లు, 230 వార్డులకు 15 ఏళ్ల నుంచి ట్రైబల్, నాన్ ట్రైబల్ పంచాయితీ వల్ల ఎన్నికలు జరగడం లేదు. KNRలో 2, మంచిర్యాలలోని గూడెం ఈసారి కూడా ఎలక్షన్స్‌కు దూరం కానున్నాయి.

Similar News

News October 4, 2025

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్‌గా గిల్

image

వన్డేల్లో టీమ్‌ ఇండియాకు బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను నియమించింది. రోహిత్‌ను తప్పించి సారథ్య బాధ్యతలను గిల్‌కు అప్పగించింది. ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు గిల్ కెప్టెన్సీ వహిస్తారు. అయితే AUS సిరీస్‌కు రోహిత్, కోహ్లీకి జట్టులో చోటు కల్పించారు.

News October 4, 2025

అమెరికాలో 2.3 కోట్ల మంది మిలియనీర్లు!

image

ప్రపంచంలో అత్యధిక మిలియనీర్లు అమెరికాలో ఉన్నట్లు ‘UBS గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025’ తెలిపింది. అక్కడ ఏకంగా 2.3 కోట్ల మంది మిలియనీర్లు ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత చైనా (63లక్షలు), ఫ్రాన్స్ (29లక్షలు) ఉన్నాయి. ఈ జాబితాలో భారతదేశం 9.17 లక్షల మంది మిలియనీర్లతో 14వ స్థానంలో నిలిచింది. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ కూడా మొదటి 15 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.

News October 4, 2025

ఆ కాఫ్ సిరప్‌ల తయారీ ఆపేయండి: ప్రభుత్వం

image

పలువురు పసిపిల్లల మరణానికి కారణమైన కాఫ్ <<17905875>>సిరప్‌లు<<>> కల్తీవేనని TN ఫుడ్ సేఫ్టీ, DRUG ADMIN DEPTలు తేల్చాయి. చెన్నై సమీపంలో ఉన్న సిరప్ తయారీ పరిశ్రమలో అవి తనిఖీలు నిర్వహించాయి. ఇక్కడ తయారయ్యే కోల్డ్రిఫ్ తదితరాలపై నిషేధం విధించడంతో వాటి ఉత్పత్తిని నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. మార్కెట్లో ఉన్న స్టాక్‌ను వెనక్కు రప్పిస్తున్నట్లు తెలిపారు. MP, రాజస్థాన్‌లలో 11 మంది పిల్లలు మరణించడం తెలిసిందే.