News October 4, 2025
అసలే ట్రంప్.. ఆపై చేతిలో కొత్త ఆయుధం!

‘నోబెల్’ కోసం ట్రంప్ కరవని గడ్డి లేదు. IND-PAKతో పాటు 7యుద్ధాలు ఆపానని ప్రకటించుకున్న ‘ట్రంపరి’ చేష్టలు చూశాం. తాజాగా <<17908342>>ఇజ్రాయెల్-హమాస్<<>> యుద్ధం ముగిసేలా ఓ ముందడుగు పడింది. దీంతో ‘అసలే ట్రంప్.. ఆపై చేతిలో హమాస్-ఇజ్రాయెల్ ఆయుధం’ ఇక ఆయన్ను ఆపగలమా! అని SMలో చర్చ జరుగుతోంది. నోబెల్ కోసం దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తెచ్చి, ఆపై వాటిని ఆపినట్లు ప్రకటించుకోవడానికైనా వెనుకాడరనే మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.
Similar News
News October 4, 2025
ముగిసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

TG: పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ ఇవాళ హాజరయ్యారు. వీరి అడ్వకేట్లను పిటిషనర్స్(BRS) తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇప్పటికే కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్‌ల విచారణ ముగిసింది. దీంతో మరో నలుగురి ఎమ్మెల్యేల విచారణ కోసం త్వరలో షెడ్యూల్ విడుదలవనుంది.
News October 4, 2025
వన్డేల్లో కెప్టెన్‌గా రో‘హిట్’

వన్డే కెప్టెన్‌గా రోహిత్‌శర్మకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి కెప్టెన్సీలో టీమ్ ఇండియా 56 మ్యాచుల్లో 42 గెలిచి 12 మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్ టై, మరోటి ఫలితం రాలేదు. రోహిత్ కెప్టెన్‌గా భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ(2025) గెలిచింది. వన్డే WC(2023) రన్నరప్‌గానూ నిలిచింది. 2024లో T20 వరల్డ్‌కప్ సాధించింది. అందులో ఫైనల్ మ్యాచ్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించారు.
News October 4, 2025
వ్యక్తిని కాపాడిన యాపిల్ వాచ్.. ఎలా అంటే?

ప్రమాదంలో ఉన్న ఓ వ్యక్తిని యాపిల్ వాచ్ కాపాడింది. ముంబైకి చెందిన టెక్ నిపుణుడైన క్షితిజ్ జోడాపే పుదుచ్చేరిలో స్కూబా డైవింగ్‌కి వెళ్లారు. అయితే 36 మీటర్ల లోతుకు వెళ్లగానే వెయిట్ బెల్ట్ తెగింది. దీంతో డేంజర్ అంటూ యాపిల్ వాచ్ అల్ట్రా హెచ్చరించింది. స్పందన లేకపోవడంతో సైరన్ (180m వరకూ వినిపిస్తుంది) మోగించింది. సమీపంలో ఉన్న ఇన్‌స్ట్రక్టర్ ఇది విని వెంటనే అతడిని బయటకు తీసి రక్షించారు.