News October 4, 2025

GNT: ప్రముఖ రచయిత లల్లాదేవి ఇకలేరు

image

ప్రముఖ రచయిత పరుచూరి నారాయణచార్యులు (లల్లాదేవి) 85 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. ‘శ్వేతనాగు’ వంటి చిత్రాలకు రచయితగా మంచి గుర్తింపు పొందారు. ఈయన రచించిన పలు నవలలు కూడా సినిమాలుగా వచ్చాయి. ముఖ్యంగా, టీటీడీ ధర్మప్రచార పరిషత్‌లో పురాణ పండిట్‌గా పనిచేస్తూ రచించిన ‘లల్లరామాయణం’ ఆయనకు పేరు తెచ్చిపెట్టింది. స్వగ్రామమైన ప్రత్తిపాడు మండలం నిమ్మగడ్డ వారి పాలెంలో శుక్రవారం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Similar News

News October 4, 2025

గుంటూరు: శాశ్వత లోక్ అదాలత్ సభ్యుడి నియామకం

image

ప్రజాసేవ, అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం శాశ్వత లోక్ అదాలత్ (పీఎల్‌ఏ) సభ్యుడి నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. రవాణా, విద్యుత్, బ్యాంకింగ్ వంటి కీలక రంగాలలో అనుభవం, 65 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఆసక్తిగల భారతీయ పౌరులు న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తులను పొందవచ్చు. దరఖాస్తులను అక్టోబరు 31వ తేదీలోపు సమర్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.ఎ.ఎల్ సత్యవతి తెలిపారు.

News October 4, 2025

ఖరీఫ్‌లో 50 వేల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

image

ఖరీఫ్ సీజన్ 2025-26లో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జేసీ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ హాలులో జరిగిన జిల్లా ధాన్య సేకరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 3,89,849 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉందన్నారు. ఇప్పటికే, డిసెంబర్ 2025 నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు.

News October 4, 2025

కాలుష్య నివారణ చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

గుంటూరు GMC పరిధిలో గాలి నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడానికి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ VC హాలులో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ద్వారా GMC పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశం జరిగింది. కాలుష్య నివారణ, రహదారుల అభివృద్ధి, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.