News April 6, 2024
ఉమ్మడి నిజామాబాద్ ప్రజలకు చల్లటి కబురు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లా ప్రజలకు ఉపశమనం కలిగించేలా హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి విషయం చెప్పింది. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.
Similar News
News November 1, 2025
వర్ని: బాలికపై లైంగిక దాడి.. యువకుడిపై పోక్సో కేసు

వర్నిమండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై గణేష్ (24)అనే యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడగా బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వర్ని SI మహేష్ తెలిపారు.
News October 31, 2025
నిజామాబాద్‌లో పోలీస్‌ల కొవ్వొత్తుల ర్యాలీ

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో పట్టణంలోని కోర్ట్ చౌరస్తా నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేవని కొనియాడారు. వారి వల్లే సమాజంలో శాంతి నెలకొందన్నారు. పోలీస్ శాఖ ఎప్పుడు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు.
News October 31, 2025
బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా నుంచి రక్షించాలి: కవిత

చారిత్రాత్మక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె శుక్రవారం బొమ్మలమ్మగుట్టను సందర్శించారు. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్నుపడిందన్నారు. సొంత ఖజానా నింపుకోవడానికి గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. భవిష్యత్ తరాల కోసం గుట్టను రక్షించుకోవాలన్నారు.


