News October 4, 2025
HYD: వైట్‌రైస్, చక్కెర తింటున్నారా? జాగ్రత్త!

నగరవాసులకు లైఫ్‌స్టైల్, ఆహార అలవాట్లతో హైకొలెస్ట్రాల్, BP, ఊబకాయం, షుగర్ కామన్ అయ్యాయని ICMR తాజా సర్వే కుండబద్ధలు కొట్టింది. వైట్‌రైస్, రీఫైన్డ్ గోధుమలు, చక్కెర, హైకార్బ్స్ ఉండే ఫుడ్డే దీనికి కారణం. 40ఏళ్లలోపువారిపై చేసిన సర్వేలో పొట్టచుట్టూ కొవ్వు 36%మందిలో హార్ట్ డిసీజ్, ప్రీడయాబెటీస్‌కు కారకం అవుతోంది. వ్యాయామంచేయాలని, కూరగాయలు, ప్రోటీన్ ఫుడ్స్ డయాబెటీస్‌పై వ్యతిరేకంగా పనిచేస్తాయని పేర్కొంది.
Similar News
News October 4, 2025
జూబ్లీహిల్స్: ‘అజ్జూ భాయ్’ ఏం చేద్దాం చెప్పు?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అజారుద్దీన్ పోటీ చేయడం లేదంటూ అధిష్ఠానం ముందుగానే గవర్నర్ కోటా కింద ఆయనను MLCగా ప్రకటించింది. ఇంతవరకు గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మైనారిటీ నేతలు అజ్జూ భాయ్ ‘నువ్వే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి’ అని ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ ఫైట్ క్లిష్టంగా మారింది. ఫైనల్‌గా అజారుద్దీన్ ఏం చేస్తారో అన్నది చర్చనీయాంశమైంది.
News October 4, 2025
HYD: తగ్గిన డోర్ డెలివరీ డొమెస్టిక్ సిలిండర్లు..!

HYD, RR, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో మొత్తం కలిపి ప్రధాన 3 సంస్థలకు సంబంధించిన డొమెస్టిక్ సిలిండర్ సుమారు 40 లక్షల వరకు ఉన్నాయి. అయితే.. వాణిజ్య కనెక్షన్లు మాత్రం లక్షకు మించి లేవని అధికారిక గుణంకాలు చెబుతున్నాయి. HYDలో 165 LPG ఏజెన్సీలు ఉండగా ప్రతిరోజు 1- 3 లక్షల డొమెస్టిక్ సిలిండర్ల డిమాండ్ ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ.. ప్రస్తుతం 60 వేలకు మించి డోర్ డెలివరీ కావటం లేదు.
News October 4, 2025
ఇదయ్యా! మా హైదరాబాద్ రోడ్ల దుస్థితి

లక్డికాపూల్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు దెబ్బతింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం RTC ఎలక్ట్రిక్ బస్ అందులో దిగబడింది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు, ఇతర సిబ్బంది కలిసి బస్సును కదిలించారు. నిత్యం ఈ పాత్ హోల్స్ కారణంగా వందల్లో బైకులు, కార్లు దెబ్బతింటున్నాయని, నడుములు పోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదయ్యా! మా HYD రోడ్ల దుస్థితి అని SMలో చర్చించుకుంటున్నారు.