News October 4, 2025
జురెల్ క్రికెట్ జర్నీ అద్భుతం: దినేశ్ కార్తీక్

<<17904558>>సెంచరీ<<>> హీరో ధ్రువ్ జురెల్ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ చెప్పారు. ఆయన ప్రయాణం అద్భుతమని కొనియాడారు. కెరీర్ ప్రారంభంలో జురెల్ తల్లి నగలు తాకట్టు పెట్టి క్రికెట్ కిట్ కొనిచ్చారని తెలిపారు. డొమెస్టిక్ టోర్నీల్లో సత్తా చాటి టీమ్ ఇండియాకు ఎంపికయ్యారని గుర్తు చేశారు. తాజాగా అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ టెస్టుల్లో తొలి శతకం బాదారని ప్రశంసించారు.
Similar News
News October 4, 2025
NHAIలో భారీ జీతంతో 16పోస్టులు

NHAI 16 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 7వరకు అప్లై చేసుకోవచ్చు. Sr AI ఇంజినీర్, AI ఇంజినీర్, అసోసియేట్ AI ఇంజినీర్, AI ప్రొడక్ట్ డిజైనర్, అసోసియేట్ AI ప్రొడక్ట్ డిజైనర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BSc, MSc, IT, ఇంజినీర్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్ డిగ్రీతో పాటు AI/MLలో పని అనుభవం ఉండాలి. https://nhai.gov.in/
News October 4, 2025
భారత న్యాయవ్యవస్థపై CJI కీలక వ్యాఖ్యలు

భారత న్యాయవ్యవస్థ బుల్డోజర్ రూల్‌తో కాకుండా Rule of Law ప్రకారం నడుస్తోందని CJI గవాయ్ పేర్కొన్నారు. నిందితులు దోషులుగా తేలకముందే వారి ఆస్తుల్ని బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని సుప్రీం నిరోధించి మార్గదర్శకాలిచ్చినట్లు మారిషస్‌లో జరిగిన సభలో చెప్పారు. ఏదైనా చట్టబద్ధం చేసినంత మాత్రాన అది న్యాయమైపోదని అన్నారు. సుప్రీం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులను గుర్తుచేస్తూ దేశ న్యాయవ్యవస్థ ప్రత్యేకతలను వివరించారు.
News October 4, 2025
పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. బయటికి రావద్దని హెచ్చరికలు

AP: ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్, అల్లూరి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. బయట ఉన్నవారు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.