News October 4, 2025

అక్టోబర్ 15 వరకు గడువు

image

‘AP బ్రాండ్ అంబాసిడర్’ నమోదుకు ముగింపు గడువు దగ్గర పడుతోంది. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్ర విజన్-2047లో యువతను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2K25’ డిజిటల్ మారథాన్‌కు ఆహ్వానం పలికింది. SEP 30తోనే గడువు ముగియగా, కాలేజీల విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు గడువును OCT 15 వరకు పొడిగించారు. ఇప్పటికే ఈ <>మారథాన్‌<<>>లో లాగిన్ చేసుకొని 715 వీడియోలు, షార్ట్స్ పంపారు.

Similar News

News October 4, 2025

షమీ కెరీర్ ముగిసినట్లేనా?

image

ఇండియన్ పేసర్ షమీ ఆస్ట్రేలియా సిరీస్‌కూ ఎంపికవ్వకపోవడంతో అతడి కెరీర్ ముగిసిందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా గాయాలు కంబ్యాక్‌ను అడ్డుకుంటున్నాయి. ఇప్పుడున్న పోటీకి తోడు 6 నెలలుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోవడం షమీ కెరీర్‌ ప్రమాదంలో పడేలా ఉంది. పైగా వ్యక్తిగత సమస్యలు కూడా అతడు తిరిగి పుంజుకోవడానికి అడ్డంకిగా మారాయని విశ్లేషకులు అంటున్నారు. షమీ 64 టెస్టులు, 108 వన్డేలు, 25 T20లు ఆడారు.

News October 4, 2025

APPLY NOW: NITCలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్‌ 12 ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఆయా విభాగాల్లో పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500. వెబ్‌సైట్: https://nitc.ac.in/

News October 4, 2025

మొక్కజొన్న సాగుకు మంచి భవిష్యత్తు

image

దేశంలో మొక్కజొన్న వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇంధన దిగుమతులను తగ్గించడానికి పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలనే కేంద్ర నిర్ణయంతో ఇథనాల్ పరిశ్రమలు మొక్కజొన్నలను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. అలాగే పశువులు, కోళ్లకు దాణాగా, పాప్ కార్న్, గోధుమ పిండి, బిస్కెట్స్, ఇతర ఆహార పదార్థాల తయారీలోనూ మొక్కజొన్న ఉత్పత్తులది కీలకపాత్ర. అందుకే భవిష్యత్తుల్లో మొక్కజొన్న ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరగనుంది.