News October 4, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.870 పెరిగి రూ.1,19,400కు చేరింది. అటు 22K బంగారం 10 గ్రాములకు రూ.800 పెరిగి రూ.1,09,450 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి కిలోకి రూ.3 వేలు పెరిగి రూ.1,65,000కు చేరింది.

Similar News

News October 4, 2025

సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

image

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

News October 4, 2025

NHAIలో భారీ జీతంతో 16పోస్టులు

image

NHAI 16 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 7వరకు అప్లై చేసుకోవచ్చు. Sr AI ఇంజినీర్, AI ఇంజినీర్, అసోసియేట్ AI ఇంజినీర్, AI ప్రొడక్ట్ డిజైనర్, అసోసియేట్ AI ప్రొడక్ట్ డిజైనర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BSc, MSc, IT, ఇంజినీర్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్‌ డిగ్రీతో పాటు AI/MLలో పని అనుభవం ఉండాలి. https://nhai.gov.in/

News October 4, 2025

భారత న్యాయవ్యవస్థపై CJI కీలక వ్యాఖ్యలు

image

భారత న్యాయవ్యవస్థ బుల్డోజర్ రూల్‌తో కాకుండా Rule of Law ప్రకారం నడుస్తోందని CJI గవాయ్ పేర్కొన్నారు. నిందితులు దోషులుగా తేలకముందే వారి ఆస్తుల్ని బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని సుప్రీం నిరోధించి మార్గదర్శకాలిచ్చినట్లు మారిషస్‌లో జరిగిన సభలో చెప్పారు. ఏదైనా చట్టబద్ధం చేసినంత మాత్రాన అది న్యాయమైపోదని అన్నారు. సుప్రీం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులను గుర్తుచేస్తూ దేశ న్యాయవ్యవస్థ ప్రత్యేకతలను వివరించారు.