News October 4, 2025
ఆయన కన్నెర్ర చేస్తే కష్టాలే!

జ్యోతిష శాస్త్రం ప్రకారం.. శని దేవుడు కర్మలకు అధిపతి. మన జీవితంలోని ప్రతి క్రియకు తగిన కర్మ ఫలితాలను ఆయనే నిర్ణయిస్తారు. వాటిని సక్రమంగా అమలు చేస్తారు. అందుకే శని భగవాన్‌కి అంతటి ప్రాధాన్యం ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం సుఖశాంతులతో ఉంటామని పండితులు చెబుతున్నారు. ఆయన కన్నెర్ర చేస్తే మాత్రం కర్మలకనుగుణంగా కష్టాలు పడాల్సిందేనని అంటున్నారు. ఆయన కరుణ కోసం ధర్మంగా ఉండటం, సత్కర్మలు చేయడం ముఖ్యం.
Similar News
News October 4, 2025
అందుకే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారా?

వన్డే కెప్టెన్‌గా <<17911822>>గిల్‌ను<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి ముందు రోహిత్‌తో BCCI చర్చలు జరిపింది. 2027 వన్డే WCను దృష్టిలో పెట్టుకొని యువ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. ‘2027 వరకు ఆడతారా?’ అని రోహిత్, కోహ్లీని అడగగా వారు స్పష్టమైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అందుకే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆయనతో పాటు కోహ్లీకి సాధారణ జట్టు సభ్యులుగా చోటు కల్పించింది.
News October 4, 2025
మార్కెటింగ్ వ్యూహం అదిరింది.. ‘రెడ్ బుల్’ నిలబడింది!

ఏదైనా ఒక ప్రొడక్ట్ సక్సెస్ అవ్వాలంటే మార్కెటింగ్ ముఖ్యం. అయితే వినూత్నంగా చేస్తేనే ఇది సక్సెస్ అవుతుందని నిరూపించింది ‘రెడ్ బుల్’. 1994లో ఈ సంస్థ అందరి దృష్టినీ ఆకర్షించేందుకు క్లబ్స్, యూనివర్సిటీలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగానే ఖాళీ రెడ్ బుల్ డబ్బాలను ఉంచింది. వీటిని చూసిన ప్రజల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఆ తర్వాత ఫ్రీ పంపిణీలు, స్పాన్సర్‌షిప్స్‌తో గ్లోబల్ స్థాయికి చేరింది.
News October 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 25 సమాధానాలు

1. పంచవటి గోదావరి నదీ తీరాన ఉంది.
2. అజ్ఞాతవాసంలో అర్జునుడు ‘బృహన్నల’ అనే నపుంసక వేషంలో విరాట రాజభవనంలో ఉన్నాడు.
3. అష్టాదశ పురాణాలను ‘వేద వ్యాసుడు’ రచించారు.
4. హనుమంతుడు హిమాలయాల్లోని ‘ద్రోణగిరి’ పర్వతం నుంచి సంజీవని తీసుకొచ్చారు.
5. వ్యాసుడు రచించిన భాగవతంలో మొత్తం 12 స్కంధాలు ఉన్నాయి.
<<-se>>#ithihasaluquiz<<>>