News October 4, 2025

ఈ-క్రాప్ నమోదుకు ఈ నెల 25 తుది గడువు

image

APలో ఖరీఫ్ పంటలకు ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు, సిబ్బందికి.. ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు సూచించారు. నమోదులో భాగంగా సవరణలు, సామాజిక తనిఖీ, ఇతర మార్పులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని, 31న తుది జాబితా విడుదల చేయాలని అధికారులను ఢిల్లీరావు ఆదేశించారు. ఈ క్రాప్ నమోదుకు SEP-30ని చివరి తేదీగా ప్రభుత్వం గతంలో ప్రకటించగా.. తాజాగా ఆ గడువును పెంచింది.

Similar News

News October 4, 2025

మార్కెటింగ్ వ్యూహం అదిరింది.. ‘రెడ్ బుల్’ నిలబడింది!

image

ఏదైనా ఒక ప్రొడక్ట్ సక్సెస్ అవ్వాలంటే మార్కెటింగ్ ముఖ్యం. అయితే వినూత్నంగా చేస్తేనే ఇది సక్సెస్ అవుతుందని నిరూపించింది ‘రెడ్ బుల్’. 1994లో ఈ సంస్థ అందరి దృష్టినీ ఆకర్షించేందుకు క్లబ్స్, యూనివర్సిటీలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగానే ఖాళీ రెడ్ బుల్ డబ్బాలను ఉంచింది. వీటిని చూసిన ప్రజల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఆ తర్వాత ఫ్రీ పంపిణీలు, స్పాన్సర్‌షిప్స్‌తో గ్లోబల్ స్థాయికి చేరింది.

News October 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 25 సమాధానాలు

image

1. పంచవటి గోదావరి నదీ తీరాన ఉంది.
2. అజ్ఞాతవాసంలో అర్జునుడు ‘బృహన్నల’ అనే నపుంసక వేషంలో విరాట రాజభవనంలో ఉన్నాడు.
3. అష్టాదశ పురాణాలను ‘వేద వ్యాసుడు’ రచించారు.
4. హనుమంతుడు హిమాలయాల్లోని ‘ద్రోణగిరి’ పర్వతం నుంచి సంజీవని తీసుకొచ్చారు.
5. వ్యాసుడు రచించిన భాగవతంలో మొత్తం 12 స్కంధాలు ఉన్నాయి.
<<-se>>#ithihasaluquiz<<>>

News October 4, 2025

సరికొత్త కంటెంట్‌తో Way2News

image

✍️ ప్రతిరోజూ వ్యవసాయం, తెగుళ్లు, చీడపీడల నివారణ, పాడి సమాచారం కోసం ‘పాడి పంటలు’ కేటగిరీ
✍️ డైలీ ఆధ్యాత్మిక సమాచారం, ధర్మ సందేహాలు-సమాధానాలు, పంచాంగం, రాశి ఫలాల కోసం ‘భక్తి’ కేటగిరీ
✍️ ప్రతిరోజూ మహిళలు, గర్భిణుల ఆరోగ్యం, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం ‘వసుధ’ కేటగిరీ
✍️ డైలీ వివిధ రకాల ఉద్యోగాల కోసం ‘జాబ్స్’ కేటగిరీ
* యాప్ అప్డేట్ చేసుకోండి. స్క్రీన్‌పై క్లిక్ చేస్తే కింద కేటగిరీలు ఆప్షన్ కనిపిస్తుంది.