News October 4, 2025

నన్ను లేడీ ప్రభాస్ అంటారు: శ్రీనిధి శెట్టి

image

తాను సోషల్ మీడియాలో లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తానని హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్నారు. దాంతో స్నేహితులు తనను లేడీ ప్రభాస్ అని పిలుస్తారని ఓ ఇంటర్వూలో చెప్పారు. అటు త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమాలో నటిస్తున్నారనే ప్రచారాన్ని ఆమె ఖండించారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదని, అవకాశం వస్తే యాక్ట్ చేస్తానని తెలిపారు. కాగా సిద్ధూ జొన్నలగడ్డతో శ్రీనిధి నటించిన ‘తెలుసు కదా’ మూవీ ఈ నెల 17న రిలీజ్ కానుంది.

Similar News

News October 4, 2025

అన్ క్లెయిమ్డ్ మొత్తం ₹1.84 లక్షల కోట్లు: నిర్మల

image

బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద CLAIM కాని డబ్బు ₹1.84 లక్షల కోట్లు ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీన్ని అర్హులైన కస్టమర్లకు అధికారులు తిరిగి చేర్చాలన్నారు. ‘మీ డబ్బు మీ హక్కు’ ప్రచారాన్ని ఆమె గుజరాత్‌లో ప్రారంభించారు. ‘ఈ నగదు సమాచారంపై UDGAM పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అర్హులైన వారు ఈ పోర్టల్ లేదా బ్యాంకులో తగిన పత్రాలు చూపించి క్లెయిమ్ చేసుకోవచ్చు’ అని సూచించారు.

News October 4, 2025

ఈ యూట్యూబర్ ఆస్తి రూ.665 కోట్లు!

image

యూట్యూబ్ చాలామందిని కోటీశ్వరులను చేస్తోంది. కేవలం యూట్యూబ్ ద్వారానే కొందరు రూ.వందల కోట్లలో నికర ఆస్తిని కూడగట్టుకున్నారు. ‘MyJAR’ డేటా ప్రకారం ఇండియాలో రిచెస్ట్ యూట్యూబర్‌గా తన్మయ్ భాట్ (రూ.665 కోట్లు) నిలిచారు. ఆ తర్వాత టెక్నికల్ గురూజీ (రూ.356Cr), సమయ్ రైనా (₹140Cr), క్యారీమినాటీ (₹131Cr), BB కి వినెస్ (₹122Cr), అమిత్ భదానా (₹80Cr), ట్రిగ్గర్డ్ ఇన్సాన్ (₹65Cr), ధ్రువ్ రాఠీ (₹60Cr) ఉన్నారు.

News October 4, 2025

శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌లో ఉద్యోగాలు

image

శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌ వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో సీకన్నీ(2), సౌండింగ్ సూపర్‌వైజర్ కమ్ డ్రాఫ్ట్స్‌మన్(3), జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్(2) ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, ఇన్‌లాండ్ మాస్టర్ సర్టిఫికెట్, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://smp.smportkolkata.in/