News October 4, 2025
రామగుండం: యూరియా ఉత్పత్తి ప్రారంభం

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో యూరియా ఉత్పత్తిని పునరుద్ధరించారు. AUG 14న పైప్‌లైన్ లీక్ వల్ల ప్లాంట్‌ను నిలిపివేశారు. సెప్టెంబర్ 28న మరమ్మతులు పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించారు. రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియాను తయారు చేస్తున్నారు. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి కొనసాగుతుండగా, HYDకు 25వేల మెట్రిక్ టన్నుల యూరియా రైలు ద్వారా పంపేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
Similar News
News October 4, 2025
ములుగు: ఆ లీడర్ మళ్లీ వస్తున్నారా..?

ములుగుకు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అతను. అనూహ్యంగా పక్క నియోజకవర్గానికి వెళ్లాల్సి వచ్చినా గెలిచి సంచలనాన్ని మూటగట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఓడినా స్టేట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కించుకున్నారు. ఏడేళ్లుగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆ లీడర్ మళ్లీ తిరిగి వస్తున్నారట. తన రీ ఎంట్రీపై ఇప్పటికే అభిమానులకు సందేశం పంపిన ఆయన లోకల్ బాడీ ఎన్నికల నుంచే బలప్రదర్శన చేస్తారనే చర్చ జోరందుకుంది.
News October 4, 2025
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమం: మంత్రి సుభాష్

రామచంద్రపురం నియోజకవర్గ నిరుద్యోగ యువకులకు BS6, BS7 బైక్ రిపేర్‌పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వసతి గృహం వద్ద 30 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. నూరు శాతం హాజరు కలిగిన అభ్యర్థులకు అధునాతన టూల్‌కిట్ అందజేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
News October 4, 2025
చేనేత, టెక్స్టై టైల్స్, రెడీ మెడ్ ఎగ్జిబిషన్ సందర్శించిన కలెక్టర్

సూపర్ జీఎస్టి-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం అమలులో భాగంగా భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో చేనేత, టెక్స్టై టైల్స్, రెడీ మెడ్ ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జీఎస్టీ తగ్గింపు ద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రతి కుటుంబానికి ఆర్థికంగా కొంత ప్రయోజనం ఉంటుందన్నారు.