News October 4, 2025

భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింత?

image

ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు UK ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. నీరవ్‌ భారత్‌కు వచ్చాక మోసం, మనీలాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారిస్తామని భారత ప్రభుత్వం బ్రిటీష్ అధికారులకు హామీ పత్రం అందజేసింది. అతడికి హై ప్రొఫైల్ ఖైదీలకు అందించే సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది. వీటికి సమ్మతించిన ఆ దేశ ప్రభుత్వం ఈ నెల 23న ఆయన్ను అప్పగించే అవకాశాలున్నాయని జాతీయ మీడియా పేర్కొంది.

Similar News

News October 4, 2025

రోహిత్‌ని గిల్లి జోల పాడుతున్న బీసీసీఐ!

image

రోహిత్‌ను ODI <<17911822>>కెప్టెన్సీ<<>> నుంచి BCCI తప్పించిన విషయం తెలిసిందే. ఈ చర్యపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే BCCI రోహిత్‌ని బుజ్జగించే చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అతని ఘనతను కీర్తిస్తూ Xలో ఓ పోస్ట్ చేసింది. రోహిత్ కెప్టెన్సీ టెన్యూర్‌కు సెల్యూట్ చెప్పింది. ఆ స్టాట్స్&ట్రోఫీల్లో 2018 ఆసియా కప్‌ను మెన్షన్ చేయలేదు. దీంతో రోహిత్‌ను BCCI గిల్లి మరీ జోల పాడుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News October 4, 2025

ALERT: రేపు భారీ వర్షాలు

image

తెలంగాణలోని 10 జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేటలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News October 4, 2025

అన్ క్లెయిమ్డ్ మొత్తం ₹1.84 లక్షల కోట్లు: నిర్మల

image

బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద CLAIM కాని డబ్బు ₹1.84 లక్షల కోట్లు ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీన్ని అర్హులైన కస్టమర్లకు అధికారులు తిరిగి చేర్చాలన్నారు. ‘మీ డబ్బు మీ హక్కు’ ప్రచారాన్ని ఆమె గుజరాత్‌లో ప్రారంభించారు. ‘ఈ నగదు సమాచారంపై UDGAM పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అర్హులైన వారు ఈ పోర్టల్ లేదా బ్యాంకులో తగిన పత్రాలు చూపించి క్లెయిమ్ చేసుకోవచ్చు’ అని సూచించారు.