News October 4, 2025
ఇదయ్యా! మా హైదరాబాద్ రోడ్ల దుస్థితి

లక్డికాపూల్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు దెబ్బతింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం RTC ఎలక్ట్రిక్ బస్ అందులో దిగబడింది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు, ఇతర సిబ్బంది కలిసి బస్సును కదిలించారు. నిత్యం ఈ పాత్ హోల్స్ కారణంగా వందల్లో బైకులు, కార్లు దెబ్బతింటున్నాయని, నడుములు పోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదయ్యా! మా HYD రోడ్ల దుస్థితి అని SMలో చర్చించుకుంటున్నారు.
Similar News
News October 4, 2025
అమెరికాలో LBనగర్ యువకుడి మృతి.. CM దిగ్భ్రాంతి

అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో LBనగర్ వాసి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదనను కలిగించిందని CM రేవంత్ అన్నారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని CM ట్వీట్ చేశారు.
News October 4, 2025
జంట జలాశయాలకు వరద.. గేట్లు ఎత్తివేత

జంట జలాశయాలకు మరోసారి వరద నీరు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో ఉస్మాన్‌సాగర్ 3 గేట్లు, హిమాయత్‌సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు సూచించారు. వరదలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జలమండలి అధికారులు పరిస్థితిని సమీక్షించారు.
News October 4, 2025
గోదావరి ఫేజ్- 2&3 పనులు త్వరలో ప్రారంభం

గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2&3 ప్రాజెక్టు పనులు త్వరగా ప్రారంభించాలని జలమండలి MD అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ప్రాజెక్టులో భాగంగా ఘన్‌పూర్ వద్ద నిర్మించనున్న మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు రూ.7,360 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. మూసీ పునరుజ్జీవనం, జంట జలాశయాలను గోదావరితో నింపడానికి ఈ ఫేజ్ 2, 3కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.