News October 4, 2025

NRPT: ఎన్నికల కోడ్.. ప్రజావాణి రద్దు

image

నారాయణపేట జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తునట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ప్రకటనలో తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని చెప్పారు.

Similar News

News October 4, 2025

తొలిసారి భారత్‌కు UK PM స్టార్మర్

image

యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్‌ స్టార్మర్ తొలిసారి భారత్‌కు రానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన అక్టోబర్ 8, 9 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఇదే ఆయన తొలి అధికారిక పర్యటన. ఈనెల 9న ఇద్దరు ప్రధానులు ముంబై వేదికగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరుపుతారు. ముంబైలో జరిగే 6వ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కూ వీరిద్దరు హాజరుకానున్నారు.

News October 4, 2025

రాజమండ్రి: 6న స్కూల్ గేమ్స్ సెలక్షన్స్: DEO

image

ఉమ్మడి తూ.గో జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సెలక్షన్స్‌ను ఈ నెల 6వ తేదీన రాజమండ్రిలోని ఎస్.కె.వి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు డీఈవో కె. వాసుదేవరావు తెలిపారు. ఫుట్‌బాల్‌ అండర్-14, కరాటే అండర్-14, 17 విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత పత్రాలతో హాజరు కావాలని, వివరాలకు పీఈటీలు ఎ.వి.డి. ప్రసాదరావు, వి. భువనేశ్వరిని సంప్రదించాలని డీఈవో కోరారు.

News October 4, 2025

భట్టిప్రోలులో మామను కొట్టిన చంపిన అల్లుడు: SI

image

అల్లుడు మామను కొట్టి చంపిన ఘటన భట్టిప్రోలులో శనివారం చోటుచేసుకుంది. SI శివయ్య వివరాల మేరకు.. అద్దేపల్లికి చెందిన కారుమూరి రాంబాబును అతని చిన్న అల్లుడు ఏసు తీవ్రంగా కొట్టి చంపాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ వీరాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.