News October 4, 2025
TTDలో వీరి ట్రాన్స్‌ఫర్లు ఎప్పడు గోవిందా..?

ఏళ్ల తరబడి TTDలో ఒకే చోట పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్ చేయడంలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుచానూరు, ఇతర ఆలయాలతో పాటు తిరుపతిలోని ఇతర విభాగాల్లో పనిచేసే సిబ్బందిని బదిలీ చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారట. అయితే బ్రహ్మోత్సవాల అనంతరం వారిపై బదిలీ వేటు పడుతుందని పాలకమండలి సభ్యుల వాదన. బ్రహ్మోత్సవాలు ముగియడంతో ట్రాన్స్‌ఫర్లు ఎప్పడు ఉంటాయో చూడాలి.
Similar News
News October 4, 2025
తొలిసారి భారత్‌కు UK PM స్టార్మర్

యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్ తొలిసారి భారత్‌కు రానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన అక్టోబర్ 8, 9 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఇదే ఆయన తొలి అధికారిక పర్యటన. ఈనెల 9న ఇద్దరు ప్రధానులు ముంబై వేదికగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరుపుతారు. ముంబైలో జరిగే 6వ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కూ వీరిద్దరు హాజరుకానున్నారు.
News October 4, 2025
రాజమండ్రి: 6న స్కూల్ గేమ్స్ సెలక్షన్స్: DEO

ఉమ్మడి తూ.గో జిల్లా స్కూల్ గేమ్స్ సెలక్షన్స్‌ను ఈ నెల 6వ తేదీన రాజమండ్రిలోని ఎస్.కె.వి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు డీఈవో కె. వాసుదేవరావు తెలిపారు. ఫుట్‌బాల్ అండర్-14, కరాటే అండర్-14, 17 విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత పత్రాలతో హాజరు కావాలని, వివరాలకు పీఈటీలు ఎ.వి.డి. ప్రసాదరావు, వి. భువనేశ్వరిని సంప్రదించాలని డీఈవో కోరారు.
News October 4, 2025
భట్టిప్రోలులో మామను కొట్టిన చంపిన అల్లుడు: SI

అల్లుడు మామను కొట్టి చంపిన ఘటన భట్టిప్రోలులో శనివారం చోటుచేసుకుంది. SI శివయ్య వివరాల మేరకు.. అద్దేపల్లికి చెందిన కారుమూరి రాంబాబును అతని చిన్న అల్లుడు ఏసు తీవ్రంగా కొట్టి చంపాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ వీరాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.