News October 4, 2025

విశాఖలో గంజిపడి 16 మంది పిల్లలకు గాయాలు

image

విశాఖలో అన్నదానం కార్యక్రమం వద్ద శనివారం అపశృతి చోటుచేసుకుంది. జాలరిపేటలోని దుర్గమ్మ ఆలయం సమీపంలో పిల్లా అప్పయ్యమ్మ సంఘం వద్ద అన్నదాన కార్యక్రమంలో గంజి పడి 16 మంది పిల్లలు, మహిళలు గాయపడ్డారు. బాధితులను కేజీహెచ్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.వాణితో మాట్లాడి మెరుగైన చికిత్స ఇవ్వాలని సూచించారు.

Similar News

News October 5, 2025

విశాఖలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

image

కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. 5న రాత్రి విశాఖ చేరుకొని హోటల్లో బస చేస్తారు. 6న ఉదయం 10 గంటలకు పోర్టు ఎల్పీజీ బెర్త్ వద్ద శివాలిక్ నౌకను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు సాగరమాల కన్వెన్షన్‌లో విశాఖ పోర్టు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 6.15కి విశాఖ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

News October 4, 2025

బీచ్‌లను సుందరంగా తీర్చిదిద్దండి: జీవీఎంసీ కమిషనర్

image

విశాఖలో త్వరలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్, ఐఎఫ్ఆర్ దృష్ట్యా బీచ్‌లను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. కాలువల ద్వారా వ్యర్థాలు సముద్రంలో కలవకుండా ఉండేందుకు కాలువల వద్ద వెంటనే స్క్రీన్లు, ఆధునిక వలలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.

News October 4, 2025

ఎన్‌ఏడీలో తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..!

image

విశాఖలోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఎన్‌ఏడీ జంక్షన్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పనులు వేగవంతమయ్యాయి. ఎన్‌ఏడీ నుంచి కాకానినగర్ వరకు 11 మీటర్ల వెడల్పుతో తేలికపాటి వాహనాల కోసం నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2025 చివరి నాటికి దీనిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గాజువాక వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణం సులభతరం కానుంది.