News October 4, 2025

దొంగల ముఠా అరెస్టు.. రూ.22 లక్షల సొత్తు స్వాధీనం

image

అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేవాలయాలు, ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న ముగ్గురు పాత నేరస్థులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.22 లక్షల విలువైన 12.350 కేజీల వెండి, 44 గ్రాముల బంగారం, ఇత్తడి, రాగి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 20 చోరీ కేసులను ఛేదించినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు.

Similar News

News October 30, 2025

మహిళ సూసైడ్ అటెంప్ట్

image

గుత్తి మండలం అబ్బేదొడ్డినికి చెందిన శిరీష పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి, 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని శిరీషకు సూచించారు.

News October 29, 2025

అనంత జిల్లాలో 80.4 మి.మీ వర్షపాతం నమోదు

image

అనంత జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 80.4 మి.మీ కురిసింది. అత్యధికంగా తాడిపత్రి మండలంలో 10.8 మి.మీ, ఎల్లనూరు 10.2, పుట్లూరు 9.8, గుత్తి 6.8, పెద్దవడుగూరు 6.0, యాడికి 5.0, నార్పల 4.8, పెద్దపప్పూరు 4.4, గార్లదిన్నె 4.0, BKS 3.0, గుంతకల్ 2.4, శింగనమల 2.4, కూడేరు 2.0, ఆత్మకూరు 2.0, అనంతపురం అర్బన్ 2.0, పామిడి 1.4, కళ్యాణదుర్గం 1.2, రాయదుర్గం మండలంలో 1.0 కురిసింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.

News October 29, 2025

గుత్తి: తుపాన్ ఎఫెక్ట్ ధర్మవరం – మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు రద్దు

image

మొంథా తుపాన్ ప్రభావంతో ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు సర్వీసును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. MTM – DMM వెళ్లనున్న రైలు సేవలు రద్దయ్యాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. బుధవారం ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు (17215)ను కూడా రద్దు చేశామన్నారు.