News October 4, 2025
PHOTO: ఆటో డ్రైవర్ గెటప్‌లో హోంమంత్రి

హోం మంత్రి వంగలపూడి అనిత ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆటో డ్రైవర్ సీట్‌లో కూర్చున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ అతిథి గృహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఆటోలో ప్రయాణం చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన ఆమె వారికి చెక్కు అందజేశారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన కూటమి ప్రభుత్వం కొత్తగా ఈ పథకాన్ని అమలు చేసి ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిందన్నారు.
Similar News
News October 5, 2025
MDK: బైక్ దొంగకు నిప్పు.. ఒకరి పరిస్థితి విషమం

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బైక్ దొంగిలిస్తున్న యేవాన్, మహిపాల్‌లను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఆగ్రహంతో వారి జేబులోని పెట్రోల్‌తో ఒకరిపై నిప్పంటించారు. మంటలు ఆర్పిన పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యేవాన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, మరొ దొంగ మహిపాల్‌పై ఇది వరకు పోక్సో కేసు ఉందని పోలీసులు తెలిపారు.
News October 5, 2025
నిజాసాగర్ 6గేట్ల నుంచి 51,761 క్యూసెక్కులు విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. శనివారం సాయంత్రం 51,761 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 6 వరద గేట్లను ఎత్తి 51,762 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.687 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.
News October 5, 2025
ఆలస్యం చేస్తే ఊరుకోను.. ట్రంప్ వార్నింగ్

తన ప్రకటనపై హమాస్ వేగంగా స్పందించాలని అమెరికా అధ్యక్షుడు <<17906657>>ట్రంప్ హెచ్చరించారు<<>>. ‘బందీలను విడుదల చేసేందుకు, శాంతి ఒప్పందాన్ని అమలు చేసేందుకు తాత్కాలికంగా బాంబింగ్ ఆపినందుకు ఇజ్రాయెల్‌ను అభినందిస్తున్నా. హమాస్ వైపు నుంచి ఏదైతే జరుగుతుందని అందరూ భావిస్తున్నారో అలాంటి ఆలస్యాన్ని నేను సహించను. బందీలను విడుదల చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి. అందరితో న్యాయంగా వ్యవహరిస్తాం’ అని SMలో పోస్ట్ చేశారు.