News October 4, 2025
జూబ్లీహిల్స్: ‘అజ్జూ భాయ్’ ఏం చేద్దాం చెప్పు?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అజారుద్దీన్ పోటీ చేయడం లేదంటూ అధిష్ఠానం ముందుగానే గవర్నర్ కోటా కింద ఆయనను MLCగా ప్రకటించింది. ఇంతవరకు గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మైనారిటీ నేతలు అజ్జూ భాయ్ ‘నువ్వే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి’ అని ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ ఫైట్ క్లిష్టంగా మారింది. ఫైనల్‌గా అజారుద్దీన్ ఏం చేస్తారో అన్నది చర్చనీయాంశమైంది.
Similar News
News October 4, 2025
HYDకు తొలి టెస్లా.. కొన్నది ఇతనే!

కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి సీనియర్ సర్జన్ డా.ప్రవీణ్ Tesla Model Y కొనుగోలు చేశారు. తనకు భద్రకాళీ అమ్మవారు సెంటిమెంట్ అనుకుంటా! ఈ దసరాకి అక్కడే వాహన పూజ చేయించారు. ‘వాహన పూజ చేయించకుంటే భారతీయ సంస్కృతిలో టెస్లానే కాదు ఏ కారు అయినా 5 స్టార్ రేటింగ్ పొందదు’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, TGలో తొలి టెస్లా కారు ప్రవీణ్ కొనుగోలు చేయడం విశేషం. ఈ కారు ధర (ex-showroom) రూ.59.89 లక్షలుగా ఉంది.
News October 4, 2025
అమెరికాలో LBనగర్ యువకుడి మృతి.. CM దిగ్భ్రాంతి

అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో LBనగర్ వాసి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదనను కలిగించిందని CM రేవంత్ అన్నారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని CM ట్వీట్ చేశారు.
News October 4, 2025
జంట జలాశయాలకు వరద.. గేట్లు ఎత్తివేత

జంట జలాశయాలకు మరోసారి వరద నీరు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో ఉస్మాన్‌సాగర్ 3 గేట్లు, హిమాయత్‌సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు సూచించారు. వరదలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జలమండలి అధికారులు పరిస్థితిని సమీక్షించారు.