News October 4, 2025
మీకు తెలుసా? మెమరీలో మహిళలే బెస్ట్

పురుషులతో పోలిస్తే మహిళల్లో మెమరీ స్కిల్స్ అధికంగా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఏవైనా ఘటనలనే కాకుండా కొత్త ముఖాలు, లిస్టులోని వస్తువులు, మాటలను కూడా ఎక్కువకాలం గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా మిడిల్ ఏజ్ ఉమెన్స్‌లో ఈ శక్తి అధికంగా ఉంటుంది. అయితే రుతుక్రమం ఆగిపోయిన తర్వాత మెమరీ స్కిల్ క్రమంగా తగ్గినప్పటికీ మగాళ్ల కంటే బెటర్‌గా ఉంటుంది.
Similar News
News October 5, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 05, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.23 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
✒ ఇష: రాత్రి 7.14 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 5, 2025
‘పూర్వోదయ స్కీమ్’ను సద్వినియోగం చేసుకోవాలి: CM

AP: కేంద్రం ప్రారంభించిన పూర్వోదయ స్కీమ్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని CM చంద్రబాబు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించాల్సిన ప్రణాళికలపై సమీక్షించారు. ఉద్యాన పంటలు, ఫిషరీస్, ఆక్వా తదితర రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలని, సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పాలన్నారు.
News October 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.