News October 4, 2025
భారత న్యాయవ్యవస్థపై CJI కీలక వ్యాఖ్యలు

భారత న్యాయవ్యవస్థ బుల్డోజర్ రూల్‌తో కాకుండా Rule of Law ప్రకారం నడుస్తోందని CJI గవాయ్ పేర్కొన్నారు. నిందితులు దోషులుగా తేలకముందే వారి ఆస్తుల్ని బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని సుప్రీం నిరోధించి మార్గదర్శకాలిచ్చినట్లు మారిషస్‌లో జరిగిన సభలో చెప్పారు. ఏదైనా చట్టబద్ధం చేసినంత మాత్రాన అది న్యాయమైపోదని అన్నారు. సుప్రీం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులను గుర్తుచేస్తూ దేశ న్యాయవ్యవస్థ ప్రత్యేకతలను వివరించారు.
Similar News
News October 5, 2025
‘పూర్వోదయ స్కీమ్’ను సద్వినియోగం చేసుకోవాలి: CM

AP: కేంద్రం ప్రారంభించిన పూర్వోదయ స్కీమ్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని CM చంద్రబాబు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించాల్సిన ప్రణాళికలపై సమీక్షించారు. ఉద్యాన పంటలు, ఫిషరీస్, ఆక్వా తదితర రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలని, సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పాలన్నారు.
News October 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 5, 2025
శుభ సమయం (05-10-2025) ఆదివారం

✒ తిథి: శుక్ల త్రయోదశి మ.12.52 వరకు
✒ నక్షత్రం: శతభిషం ఉ.6.42 వరకు
✒ శుభ సమయం: ఉ.8.30-ఉ.9.05
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13
✒ వర్జ్యం: మ.12.55-మ.2.28
✒ అమృత ఘడియలు: రా.10.15-రా.11.47