News April 6, 2024
రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ షెడ్యూల్ ఇదే

ప్రకాశం జిల్లాలో రేపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన వివరాలను అధికారులకు సీఎం సమాచారం అందజేసింది. రేపు ఉదయం 9గంటలకు కనిగిరి నియోజకవర్గంలో మొదలయ్యే సీఎం జగన్ పర్యటన చిన్నారికట్ల మీదుగా కొనకనమిట్ల చేరుకొంటుంది. అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్ లో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం రాత్రికి దర్శి నియోజకవర్గానికి చేరుకొని అక్కడ సీఎం బస చేయనున్నట్లుగా పేర్కొన్నారు.
Similar News
News September 8, 2025
ఒంగోలు: యువతిపై లైంగిక దాడికి యత్నం

ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలంలో యువతిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్తపట్నానికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో అతడు దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయగా స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈలోపు నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కొత్తపట్నం పోలీసులు గాలించి అతడిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
News September 8, 2025
ఒంగోలు: పొగాకు రైతులకు గుడ్ న్యూస్

ప్రకాశం జిల్లాలోని పొగా రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సాధారణంగా ప్రభుత్వం పొగాకు సాగుపై కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ మేరకు కొనుగోళ్లు చేస్తారు. లిమిట్‌కు మించి పండించిన పొగాను సైతం కొనేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ముందుకు వచ్చిందని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి రామకృష్ణ వెల్లడించారు. రైతులు అదనంగా పండించిన పంటను ఈనెల 9వ తేదీ నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు.
News September 8, 2025
ఒంగోలులో ప్రశాంతంగా ముగిసిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలు

ఒంగోలులో ఆదివారం అటవీశాఖ పోస్టుల భర్తీకై నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DRO ఓబులేసు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 10 పరీక్ష కేంద్రాలను DRO ఆదివారం సందర్శించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 1153 మందికి గాను 901 మంది హాజరైనట్లు, మిగిలిన పోస్టులకు 7052 మందికి గాను 5642 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు.