News October 4, 2025
ఆటో డ్రైవర్లకు అండగా కూటమి: కేంద్రమంత్రి

ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ఉందని ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్‌ల డ్రైవర్లకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. ఏపీలో 2.90 లక్షల మందికి రూ.436 కోట్ల లబ్ధి చేకూరుతుందని అన్నారు. శనివారం భీమవరంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు ఉన్నారు.
Similar News
News October 5, 2025
నరసాపురం: నేటి నుంచి పంటి రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

ఉభయగోదావరి జిల్లాల మధ్య గోదావరిలో నిలిచిన పంటి రాకపోకల్ని నేటి నుంచి అధికారులు పునరుద్ధరిస్తున్నట్లు నరసాపురం ఎమ్మార్వో సత్యనారాయణ చెప్పారు. గత వారం రోజులుగా గోదావరి వరద ఉద్ధృతికి ముందస్తుగా సఖినేటిపల్లి- మాధవాయిపాలెం రేవుల మధ్య పంటి రాకపోకల్ని ఆపేశారు. దీంతో లంక ప్రజలు చించినాడ మీదుగా చుట్టూ తిరిగే వచ్చారు. యంత్రాంగం ఈ దారిలో వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారికి కష్టాలు తప్పనున్నాయి.
News October 4, 2025
చేనేత, టెక్స్టై టైల్స్, రెడీ మెడ్ ఎగ్జిబిషన్ సందర్శించిన కలెక్టర్

సూపర్ జీఎస్టి-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం అమలులో భాగంగా భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో చేనేత, టెక్స్టై టైల్స్, రెడీ మెడ్ ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జీఎస్టీ తగ్గింపు ద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రతి కుటుంబానికి ఆర్థికంగా కొంత ప్రయోజనం ఉంటుందన్నారు.
News October 4, 2025
ప.గో: 8489 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్త్రీ శక్తి పథకం అనంతరం నష్ట పోతున్నామని భావించిన ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందజేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 8,489 మందికి రూ.12.73 కోట్లు మేర లబ్ధి చేకూరనుంది. నేడు అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ కానుంది.