News October 4, 2025

NZB: ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో కలెక్టర్ వారికి దిశా నిర్దేశం చేస్తూ మాట్లాడారు.

Similar News

News October 5, 2025

NZB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించాలి: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ సంకల్పం మేరకు మున్సిపాలిటీల పరిధిలో కూడా ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించాలన్నారు.

News October 4, 2025

NZB: రూ.22 కోట్ల మద్యం తాగేశారు..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ దసరా సందర్భంగా రెండు రోజుల్లోనే రూ.22 కోట్లకు పైగా మద్యం విక్రయాలు కొనసాగాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.5 కోట్లు అధికంగా విక్రయాలు కొనసాగినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. NZB జిల్లాలో 102 వైన్ షాపులు, 20 బార్లు, KMR జిల్లాలో 49 వైన్స్ దుకాణాలు, 8 బార్లు ఉండగా నిజామాబాద్ జిల్లాలోని మాదాపూర్ IML డిపో నుంచి రెండు రోజుల్లో రూ.22 కోట్ల మద్యం సరఫరా చేసినట్లు చెప్పారు.

News October 4, 2025

NZB: పోతే రూ.50 వేలు వస్తే రూ. 10 లక్షలు..!

image

NZB (D)లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. ‘హలో మామ దసరా పండుగ ముగిసింది. ఇక మద్యం టెండర్ల మాటేంటి. టెండర్ వేద్దామా వద్దా.. ఈసారి టెండర్ రూ.3 లక్షల అంట కదా. అదే ఆలోచిస్తున్నాం. నీ వాళ్లు ఎంతమంది ఉన్నారు. నాతో కలిపి మేము ముగ్గురం. మీరు ముగ్గురు. ఆరుగురం కలిసి తలా రూ. 50వేలు వేసుకొని ఒక టెండర్ వేద్దాం. పోతే రూ.50 వేలు, లక్కీగా వస్తే మాత్రం.. దాన్ని అమ్మేస్తే తలా రూ.10 లక్షలు’ అని చర్చించుకుంటున్నారు.